కూట‌మి పాల‌న @ 30 : మంత్రి అయిన కొద్ది సమయంలోనే ఏపీని మార్చేస్తోన్న బి.సి.జనార్దన్ రెడ్డి..??

Suma Kallamadi

• సంతృప్తికరంగా సాగుతున్న కూటమి పాలన  
• రోడ్ల పనులను వివిధ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న జనార్దన్ రెడ్డి
• ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన కొంత సమయంలోనే రాష్ట్రంలో చాలా మార్పులు కనిపించాయి. ముఖ్యంగా రోడ్ల రిపేర్ పనులు మొదలయ్యాయి. ఎక్కడైతే గుంతలు పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయో అక్కడ కొత్తగా రోడ్లు వేయడం ప్రారంభిస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన రహదారులను బాగు చేస్తున్నారు.
దెబ్బతిన్న రోడ్లను త్వరగా రిపేర్ చేయాలని ఏపీ మంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రోడ్లు భవనాల శాఖను ఆదేశించారు. ఈ మీటింగ్ లో కూడా జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అవసరమైన పనులకు వెంటనే టెండర్లు పిలిచి రోడ్డు రిపేర్ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే ప్రజల గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 90,000 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని జనార్దన్ రెడ్డి నివేదించారు. ఈ రోడ్లలో 8,161 కిలోమీటర్ల మరమ్మతులకు ఆయన ఆదేశించారు.
5,731 కిలోమీటర్ల రాష్ట్ర, జిల్లా రహదారులను మరమ్మతు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, దీనికి రూ.2,153 కోట్లు ఖర్చవుతుందని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. 2014, 2019 మధ్య, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.14,970 కోట్ల బడ్జెట్‌లో రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.12,064 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కూడా ఆయన రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. గత ప్రభుత్వం 2019-2024లో కేటాయించిన రూ.19,428 కోట్లలో కేవలం రూ.9,015 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు.
బీసీ జనార్దన్ ఎప్పుడూ ప్రజాసేవకై పాటుపడుతూ ఉంటారు. బనగానపల్లెలోనే ఒక కింగ్ మేకర్ గా ఆయన రాణిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నారు. పేదలకు స్థలాలు కూడా కేటాయిస్తాని హామీ ఇచ్చారు మాట ఇచ్చిన తర్వాత తప్పే నాయకుడు కాదు జనార్దన్ రెడ్డి. ఈ ఐదేళ్లలో రోడ్ల శాఖ మంత్రిగా ఆయన ఏపీ ప్రజలకు చక్కటి సౌకర్యాలు అందించే అవకాశం ఉంది. రోడ్లను బాగు చేసిన ఆయనని ఏపీ ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: