కూటమి పాలన @30: అభివృద్ధి పథం వైపు వేగంగా అడుగులు వేస్తున్న వంగలపూడి అనిత..

Divya
•మహిళా భద్రతే ప్రధాన లక్ష్యం
•దిశా చట్టానికి దీటుగా కొత్త చట్టం
•లేడీ రెబల్గా మారిన వంగలపూడి అనిత

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ముఖ్యంగా 164 సీట్లతో అఖండ ఘనవిజయం అందుకున్న కూటమి ఇప్పుడు అభివృద్ధి పతంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని చెప్పాలి. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం పాటుపడుతున్నామని చెప్పి 2019 డిసెంబర్లో హైదరాబాదులో దిశా ఘటన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్ట సవరణ చేసి దిశా చట్టాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే కేంద్రం అనుమతి పొందకుండానే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన జగన్ ప్రభుత్వం.  దానికోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది.. దిశా చట్టం కింద పలు కేసులలో చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటనలు చేసింది.. కానీ గత ప్రభుత్వ హయాంలో ఏపీలో మహిళలపై దాడులు,  అత్యాచారాలు పెద్ద ఎత్తున కొనసాగాలని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఏపీ హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టి.. దిశా చట్టానికి చట్టబద్ధత లేదని..  మహిళల రక్షణ కోసం త్వరలోనే దీటైన చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది .. ఇకపోతే ఈమధ్య కాలంలో చిన్న పిల్లల్ని కూడా వదలకుండా కామాంధులు పాడు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.. నిన్నటికి నిన్న అసలు లోకం అంటే ఏంటో కూడా తెలియని పాపను కొంతమంది బాలురు పాడుచేసి నదిలో పడేసామని కామెంట్ చేశారు.. ఇలాంటి ఘటనలను చూస్తుంటే అసలు అమ్మాయి పుట్టిందంటేనే భయపడేంతగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది.. ఈ క్రమంలోనే వంగలపూడి అనిత మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకమైన బాధ్యతలు చేపడతామని హామీ ఇచ్చింది.

ప్రస్తుతం అన్ని విషయాలపై స్పందిస్తూ.. అటు మహిళా సాధికారతకు ఇటు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడంలో అనిత వేగంగా దూసుకు వెళ్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: