రెడ్ బుక్ దేముంది... మేము బ్లాక్ బుక్ తెరిస్తున్నాం అంటున్న జగన్?

Suma Kallamadi
ఆంధ్ర రాజకీయాలు తీరు గత దశాబ్ద కాలంగా కొత్త పుంతలు తొక్కుతోంది. గతసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సిపి పార్టీ గత ప్రతిపక్షం అయినటువంటి టిడిపి నాయకులను, కార్యకర్తలను పలు ఇబ్బందులకు గురి చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఇప్పుడు ఇదే వరస తాజాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టిడిపి కూటమి ప్రభుత్వం అవలంబిస్తోంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని విశ్లేషకులు అంటున్నారు. నేటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటయి నెలరోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సోకాల్డ్ రాజకీయ విశ్లేషకులు కూటమి ప్రభుత్వం పైన పలు విమర్శలు చేస్తున్నారు.
ఏపీలో ప్రతీ కార రాజకీయాలు ప్రభుత్వాలు చేయడం ఆపకపోతే అభివృద్ధి అనేది కుంటుపడుతుందని అభిప్రాయాలు వెళ్లబుచ్చుతున్నారు. ఇక నేరుగా విషయంలోకి వెళితే... గత కొంతకాలంగా నారా లోకేష్ రెడ్ బుక్ ఒకదానిని తయారు చేసామని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో వారిని ఆ రెడ్ బుక్ లో చేర్చి వారి తాట తీస్తామని చెప్పడం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని విమర్శలు వినబడుతున్నాయి.
లోకేష్ మాదిరి వైసిపి అధినేత బ్లాక్ బుక్ వంటిది తెరిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వైసీపీ వర్గం హెచ్చరిస్తోంది. ఇక ఆయా మాటలను పరిగణనలోకి తీసుకున్న కొంతమంది మీడియా మేధావులు ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగజారితే దానికంటే దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రాలో ఇకముందు చూడబోమని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు నీచ రాజకీయాలు మానుకుని కుంటిపడుతున్న ఏపీ అభివృద్ధిని పట్టాలెక్కించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సలహాలు ఇస్తున్నారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండబోదనే తాజా రాజకీయాల మాదిరే నాయకుల భవితవ్యం తలకిందుల అవుతుందనే విషయాన్ని సో కాల్డ్ నాయకులు గుర్తించ వలసిందిగా అభ్యర్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: