జగన్ పై రివేంజ్! చచ్చిన పాముని మళ్ళీ చంపుతున్న RRR?

Purushottham Vinay

 గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి దారుణాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారం తమదే అన్నట్లు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్  దగ్గరి నుండి కింద స్థాయి నేతలు , అధికారులు ఇలా ఎవ్వరు పడితే వారు రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. జనాలకు పెద్దగా ఉపయోగపడని చిన్నా చితక పథకాలు పెట్టారు. కానీ అవేమి పేదల బ్రతుకులని, భవిష్యత్తుని మార్చలేదు.ముఖ్యంగా తమని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం..మాజీ సీఎం అని చూడకుండా జైల్లో పెట్టడం..ఎంపీలను , మాజీ ఎంపీ లని కూడా చూడకుండా జైల్లో పెట్టి పోలిసుల చేత కొట్టించడం..మాస్క్ అడిగిన పాపనికి నడి రోడ్ ఫై ఓ డాక్టర్ ను అర్ధనగ్నంగా నిలబెట్టి కొట్టడం ఇవన్నీ కూడా జనాలు చూశారు. టైం కోసం వెయిట్ చేశారు. ఫలితంగా కూటమి జనాల ఓట్లతో గెలిచింది. ఇప్పుడు వడ్డీతో సహా వాటికి బదులు తీర్చుకోడానికి రెడీ అయింది. అసలైన ఆట వైసీపీ కి ఏంటో చూపించబోతుంది. ఇప్పుడు జగన్ విషం కక్కలేని చచ్చిన పాముతో సమానం. 


అసలే జనాల తీర్పుతో చచ్చిన పాములా జగన్ పరిస్థితి ఉంటే ఆ చచ్చిన పాముని ఇంకా కొట్టి కొట్టి చంపినట్టు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు  ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్ లపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని rrr తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కొట్టడమే కాకుండా హత్యాయత్నం కూడా చేశారని తెలిపారు. IPS సీతారామాంజనేయులు, అప్పటి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్పైనా కూడా కేసు బుక్ అయింది. 2021లో రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు విద్వేషపూరిత ప్రసంగం, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్‌లో సీఐడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెల్సిందే. అప్పుడు తనను కస్టడీకి తీసుకోవడమే కాకుండా తీవ్రంగా కొట్టారని, తనపై హత్యయత్నం కూడా జరిగిందంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు రఘురామరాజు.. సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై పిర్యాదు చేయడం జరిగింది. rrr ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద సునీల్ కుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: