ఏపీ: పవన్ గ్రామాలలో రోడ్డు వేయిస్తున్నారా..?

Divya
పవన్ కళ్యాణ్ జనసేన కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరిస్తున్నారు అలాగే.. పలు శాఖలలో భాగంగా తనకు ఇష్టమైన వాటిని తీసుకొని వాటిని మార్పులు చేర్పులు చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇప్పుడు అదే హుందాతనంతో జనసేన పార్టీ నాయకుడు హోదాలో.. గతంలో రోడ్ల విషయంలో పదే పదే ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

తాజాగా రోడ్లకు సంబంధించి ఒక రివ్యూ చేసినట్లుగా తెలుస్తోంది.. గ్రామాలకు రహదారుల అనుసంధనాల మిద ప్రత్యేకమైన  శ్రద్ధ చూపించమని చెప్పినట్లుగా అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. 4976 కోట్ల రూపాయల 7,100 కిలోమీటర్ల రోడ్డుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు కార్యరూపం దాల్చాలి అంటూ పంచాయతీరాజ్ సంస్థకు డిప్యూటీ సీఎం ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది.. గ్రామాలలో రహదారుల నిర్మాణం వల్ల పేదలకు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ అధికారులకు హెడ్ సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

గ్రామీణ రహదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహాయం చేకూర్చాలంటూ కోరుదామని కూడా తెలియజేశారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ కు కూడా తెలియజేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లింపు జాప్యం విషయంలో కూడా ఇబ్బందులు ఉండకూడదని గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం పనులలో కూడా పారదర్శకంగా పనులు జరగాలంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30% మ్యాచింగ్ గ్రాండ్ ను 10 శాతానికి తగ్గించే విధంగా పలు మార్పులు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామంటూ తెలియజేశారు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 250 నుంచి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి కూడా రహదారి అనుసంధానం చేయాలి అంటూ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: