బాబు పాలనలో అభివృద్ధి దిశగా ఆంధ్ర.. చంద్రన్నా మజాకా..!

Divya
•చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షం
•అధికారంలోకి వచ్చారా లేదో అప్పుడే అభివృద్ధి పనులు మొదలు
•ప్రజలకు మంచి చేకూర్చడమే లక్ష్యం..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారో లేరో అప్పుడే అభివృద్ధి దిశగా ఏపీని నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే ఈసారి అధికారంలోకి వస్తారో లేదో అని అనుమానాలు అందరిలో ఉండేవి.  ఇక ఈసారి ఓడిపోతే కచ్చితంగా టిడిపి పార్టీ కనుమరుగవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఊహించని విధంగా బిజెపి, జనసేన తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు.. ఇక ఇందులో జనసేన 21 స్థానాలలో పోటీ చేయగా 21 స్థానాలలో విజయం సాధించి.. 100% స్ట్రైక్ తో రికార్డు క్రియేట్ చేశారు.గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అట్టడుగున పడిపోయింది అంటూ .. ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా అడుగులు వేయించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక అందులో భాగంగానే నిన్న పర్యటించిన ముఖ్యమంత్రి విశాఖపట్నానికి మెట్రో రావాల్సి ఉందని..  విమానాశ్రయాన్ని మెట్రోతో అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు.. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆయన తెలిపారు. విమానాశ్రయం ప్రారంభించి ఉత్తరాంధ్ర ఋణం తీర్చుకుంటామని వెల్లడించిన చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన చంద్రబాబు.. రైతులతో మాట్లాడుతూ..  ఉత్తరాంధ్రను సుజల స్రవంతి పూర్తిచేసే జిల్లా అభివృద్ధి చెందుతుందని రైతులకు న్యాయం జరుగుతుందని.. రైతులను అభివృద్ధివైపు అడుగులు వేయించడమే  ఎన్డీఏ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.
అంతేకాదు పోలవరం ప్రాజెక్టును మరో రెండు సంవత్సరాల లో సాధ్యమైనంత వరకు పూర్తి చేసి అటు మండలాలకు,  గ్రామాలకు నీటిని సరఫరా చేసి సాగునీరు,  తాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తామని.. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా అడుగులు వేయడంలో తాము మొదటి అడుగు వేస్తున్నామని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే మెగా డీఎస్సీ, పెన్షన్, అన్నా క్యాంటీన్ లు ఇలా ఎన్నో విషయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. టీచర్ పోస్ట్లు అన్నింటిని భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. అలాగే తల్లికి వందనం,  ఉచిత బస్సు,  మహిళలకు 1500 అన్నింటినీ కూడా త్వరలోనే నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: