నిరుపేదల ఆకలిబాధలు ఖతం..పంద్రాగస్ట్ లోపు ముహూర్తం ఫిక్స్..!

FARMANULLA SHAIK
* హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం


* ఆకలి బాధలు తెలిసిన ప్రజానాయకుడు
 * ఆగస్టులో తెరుచుకోనున్న అన్నా క్యాంటిన్లు..!

( అమరావతి-ఇండియా హెరాల్డ్ ) : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఒక నెలలోపే ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకోవైపు రాష్ట్ర ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతూ పాలనలో తన మార్క్ చూపించుకుంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఇతర మంత్రి వర్గం తమ తమ శాఖలకు న్యాయం చేస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి..
పాలనలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే మెగా డీయస్సీ,వృద్ధప్య పింఛన్,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటివి అమలు చేసేసింది. ప్రస్తుతం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న హామీల్లో అమరావతి అభివృద్ధి పనులు,పోలవరం, అన్నా క్యాంటిన్లు వంటి వాటిపై ద్రుష్టి కేటాయించినట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుందని ఈ మేరకు పనుల్ని అధికారులు వేగవంతం చేశారని తెలుస్తుంది. ఆగస్టు 15వ తేదీలోగా అన్న క్యాంటీన్లు తిరిగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా ఆ మాటకి కట్టుబడి పంద్రాగస్టులోగా అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.
అన్న క్యాంటీన్ల నిర్వహరణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తోంది. ఇందు కోసం అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ప్రారంభించి.. ప్రత్యేకంగా వెబ్సైట్ తయారుచేయబోతున్నారు. దాతలు ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అన్న క్యాంటీన్ల పూర్తి భారం  ప్రభుత్వంపై పడకుండా సరికొత్త ఆలోచన చేస్తున్నారు. దాతల సాయంతో అన్నా క్యాంటీన్లు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. విరాళాల సేకరణ కూడా మొదలుపెట్టారు. అంతేకాదు మరో కొత్త ఆలోచన చేశారు సీఎం చంద్రబాబు. పుట్టినరోజు జరుపుకునే వారు ఎవరైనా సరే అన్న క్యాంటిన్ ద్వారా పేదలకు భోజనం అందిచొచ్చని చెప్పారు.నిరుపేదలకు రెండు పూటల నాలుగు వేలు నోట్లోకి వెళ్లడం చాలా కష్టం. అంతేకాదు పని నిమిత్తం, ఆస్పత్రిలో చికిత్స కోసం బయట ప్రాంతాలకు వెళ్తుంటారు చాలా మంది.అక్కడ సరైన భోజనం దొరకదు. బయట హోటళ్లలో తినాలంటే డబ్బులు సరిపోవు. అలాంటి వారికి కడుపునింపేందుకే అన్న క్యాంటీన్ల ను తీసుకొచ్చింది టీడీపీ అదే దాని ముఖ్య ఉద్దేశం. ఈ పధకం వల్ల ఎంతో మంది నిరుపేదలకు కడుపు నిండా ఆహారం దొరకుతుంది.ఈ పధకం అమలుపై పేదప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: