ఏపీని వదిలి పారిపోయిన కొడాలి నాని..?

Suma Kallamadi

వైసీపీకి చెందిన సీనియర్ లీడర్ కొడాలి నాని టిడిపి కూటమి గెలిచిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యారు ఆయన భయం కూడా మొదలయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. కొడాలి నాని ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. వాడో పప్పు గాడు, వీడు తుక్కు గాడు అంటూ చంద్రబాబు లోకేష్ లపై నోరు పారేసుకుని నాని చాలా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ఈ నేత గత ఇరవై ఏళ్లుగా గుడివాడలో ఎదురులేని పొలిటిషన్ గా కొనసాగారు. గత నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ సీటును గెలుచుకున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా ఈసారి 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మీడియా ఇంటర్వ్యూలలో టీడీపీ, జేఎస్పీ నేతలపై బాహాటంగా విమర్శలు చేసిన నాని ఇప్పుడు ప్రజల దృష్టిలో లేకుండా పోయారు.
టీడీపీ+ కూటమి భారీ విజయం సాధించడంతో వైసీపీకి కేవలం 11 సీట్లు రావడంతో నాని దాదాపు రాజకీయాలకు దూరమయ్యారు. ఇటీవల గుడివాడలోని వాలంటీర్లు తమను రాజీనామా చేయాలని నాని ఒత్తిడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలోని బెవరేజెస్ గోదామును లీజుకు తీసుకున్న వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై నానిపై మరో కేసు కూడా నమోదైంది.
కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన రేషన్ బియ్యం కుంభకోణంపై విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుత పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ బియ్యం స్కాంపై ముమ్మరంగా విచారణ చేస్తుండడంతో నానిపై ఒత్తిడి పెరిగింది. నాని తన సొంత మద్దతుదారులకు కూడా అందుబాటులో లేరని, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదని నివేదికలు సూచిస్తున్నాయి. ఇన్నాళ్లు బాబు, పవన్, లోకేష్ లాంటి నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నాని, 20 ఏళ్లుగా కొనసాగిన గుడివాడలో కింగ్ లాగా బతికిన నాని ఇప్పుడు ఆచూకీ లేకుండా పోవడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. దీంతో టీడీపీ తమ్ముళ్లు సరదాగా అతడిని ఆట పట్టిస్తున్నారు. ఎటు పారిపోయావు కొడాలి నాని బయటికి రా అంటూ తీవ్రంగా కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: