విజయవాడ రాజకీయాల్లో పుంజుకున్న వైసీపీ.. టీడీపీకి ఎదురుదెబ్బ?

Suma Kallamadi
ఏపీలో అధికారంలోకి వచ్చాట టీడీపీ నేతల తీరు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. కొందరు నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా చేసే పనిలో కొందరు ఉంటే, ఇంకొందరు మాత్రం పార్టీ ఏమైనా పట్టించుకోని ధోరణితో ఉన్నారు. ఇలా తెలుగు తమ్ముళ్ల వైఖరి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కనిపిస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఇటీవల చిత్తూరు నగరపాలక సంస్థలో పార్టీ ఆధిక్యం పెరిగింది. ఇప్పటి వరకు టీడీపీకి కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. అయితే వైసీపీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో టీడీపీలో చేరారు. దీంతో ఈ చిత్తూరు నగరపాలక సంస్థ టీడీపీ వశం అయింది. అయితే అదే దూకుడును రాష్ట్రం మొత్తం చూపించాలని టీడీపీ తీరు ప్రస్తుతం అలా లేదు. ముఖ్యంగా రాజధాని పరిధిలోని విజయవాడ నగర పాలక సంస్థలో టీడీపీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రం మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి గురైన వైసీపీ ఇక్కడ తన ఆధిపత్యం చాటుకుంది.
విజయవాడ నగర పాలక సంస్థలో టీడీపీకి ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఫలితాలు టీడీపీ అస్సలు ఊహించలేదు. పార్టీకి కార్పొరేషన్‌లో బలం ఉన్నప్పటికీ స్టాండింగ్ కమిటీలకు సంబంధించి టీడీపీ ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. ఇక్కడ ఉన్న ఆరు స్థానాలలో మొత్తం వైసీపీకే దక్కాయి. విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీకి 13 మంది కార్పరేటర్ల బలం ఉంది. అయితే ఇక్కడ టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు అందరినీ నివ్వెరబోయేలా చేసింది. స్టాండింగ్ కమిటీలలో మొత్తం కాకపోయినా కనీసం 2 స్థానాలను టీడీపీ దక్కించుకునే వీలుంది. అయితే అన్నిటినీ వైసీపీ ఎగరేసుకుపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం అవుతుందనుకుంటే విజయవాడలో మాత్రం చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ప్రతి రోజూ ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడే విజయవాడ టీడీపీ నేతలు నగర పాలక సంస్థలోని స్టాండింగ్ కమిటీలపై ఎందుకు దృష్టి సారించలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై చంద్రబాబు దృష్టిసారించే వీలుందని, పార్టీ నగర నేతలకు చీవాట్లు తప్పవని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: