శ్రీధర్‌ బాబుకు రేవంత్‌ చెక్‌..రంగంలోకి కొత్త ఐటీ మంత్రి?

Veldandi Saikiran

శ్రీధర్‌ బాబుకు చెక్‌ పెట్టి..కాంగ్రెస్‌ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్‌ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ ఎమ్మెల్యే. అయినా తెలంగాణ రెండో విడత మంత్రివర్గ రేసులో నేనున్నానంటూ దూసుకొచ్చాడట. కాంగ్రెస్ పక్ష నేత కోట కింద తనకు మంత్రి పదవి ఖాయమంటూ ముందు వరుసలో నిలిచారట. ఇందూరు జిల్లాలోని సీనియర్లకు సవాలు విసురుతున్నారట. తెలంగాణ ఐటీ సెల్ కన్వీనర్ గా ఉన్న మదన్ మోహన్ రావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం తన ఐటి సెల్ టీమ్ ని వినియోగించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తన టీం తో కలిసి ఢిల్లీలో ప్రత్యేక క్యాంపైన్ నిర్వహించి రాహుల్ కు మదన్ మరింత దగ్గరయ్యానే టాక్ కూడా వినిపిస్తోంది. రాహుల్ గాంధీతో మదన్మోహన్ రావుకు ఐటీ సెల్ ద్వారా మరింత సన్నిహిత సంబంధం పెరగడం ప్లస్ పాయింట్ గా మారింది. రాబోయే మంత్రివర్గ విస్తరణలో రాహుల్ గాంధీ కోటా కింద మదన్ మోహన్ రావుకు ఇవ్వాలని ప్రతిపాదన రావడంతో రేవంత్ ఎటూ తెలుసుకోలేకపోతున్నారట. దీంతో మంత్రి పదవి కోసం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఎమ్మెల్యే మదన్ కు మద్దతు ఇస్తుండటం నిజామాబాద్ జిల్లాలో ఓ సీనియర్ కి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి మంత్రి అవుతారని అనుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు మాత్రం మార్పులు చేస్తూ రేవంత్ కు సిఫారసులు చేయడం పార్టీలో ఎటూ తేల్చుకోలేకపోతున్న పరిస్థితి నెలకొందట. అటు కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ద్వారా, ఇటు ఇతర పెద్దల ద్వారా ఇప్పటికే మదన్ మోహన్ రావు రేవంత్ పై మంత్రి పదవి కోసం ఒత్తిడి తెస్తున్న కారణంగానే విస్తరణ వాయిదా పడిందనే టాక్ కూడా మరోవైపు వినిపిస్తోంది.

ఇప్పటికే వెలమ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు రేసులో ఉండగా.... రెండవ వ్యక్తిగా మదన్ మోహన్ రావు పేరు తెరపైకి వచ్చింది. రాహుల్ సిఫారసులను అమలు పరచాలా లేదా అన్నది రేవంత్ మెడపై కత్తి పెట్టిన పరిస్థితి కనిపిస్తోందట. మదన్ మోహన్ రావు 2014 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ టీడీపీ అభ్యర్థిగా.... 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి జె. సురేందర్ పై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో మదన్‌ కు మంత్రి పదవి ఇస్తే.. ఐటీ శాఖ ఇచ్చే ఛాన్స్‌ ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: