బండి సంజ‌య్: వైసీపీ నాయ‌కులు వీర‌ప్ప‌న్ వార‌సులే?

Veldandi Saikiran
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. వివాదస్పద వ్యాఖ్యలు చేసి.. తెలంగాణ రాష్ట్రంలో కీలక నేతగా ఎదగడమే కాకుండా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇప్పుడు పని చేస్తున్నారు బండి సంజయ్‌ కుమార్‌. అయితే.. తాజాగా జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ గెలికారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులు అంటూ పరోక్షంగా వైసీపీ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు బండి సంజయ్‌.
తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. ఇక ఈ తరుణంలోనే... తిరుమలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో గత పాలకులు వీరప్పన్ వారసులు అని... నిలువు నామాలతో ప్రజలకు పంగ నామాలు పెట్టారని ఆగ్రహించారు. ఎర్రచందనం దోపిడీతో సర్కార్ కే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారని నిప్పులు చెరిగారు.
శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని హెచ్చరించారు. నాస్తికులకు, అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని ఫైర్ అయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. ఏడుకొండలను రెండు కొండలు గా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయిందన్నారు.
అన్యమత పాలనపోయి గోవిందుడి పాలన వచ్చిందని కూటమి ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అండగా ఏపీ ప్రజలు నిల్చున్నందుకు కృతజ్ఙతలు తెలి పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆంధ్ర ప్రదేశ్‌ తో పాటు తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా బాగుండాలన్నారు. అయితే.. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: