పవన్ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది ఇదే.. ఆ కష్టాలను అధిగమించి జనసేన స్థాయి పెంచుతారా?

Reddy P Rajasekhar
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీలో కుర్చోవాలని పవన్ కళ్యాణ్ అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. జనసేన పార్టీ దీర్ఘకాలిక లక్ష్యం పవన్ సీఎం కావడమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎన్నికలు పూర్తై మంత్రి పదవి చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించిన పనులు మాత్రమే చూసుకుంటున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నారు.
 
వైసీపీపై విమర్శలు చేయడం కానీ వైసీపీ విమర్శలకు సమాధానం చెప్పడం కానీ చేయడం లేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ విషయంలో కూడా పాజిటివ్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మారారని కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ ప్రస్తుతం పిఠాపురం ప్రాంతానికి పూర్తిస్థాయిలో పరిమితం కావడం జరిగింది. పిఠాపురం వాసులకు పవన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటున్నారు.
 
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రిలీజ్ కావడం కూడా సులువు కాదని పవన్ సినిమాలకు డేట్లు కేటాయించడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని భోగట్టా. అయితే పవన్ కార్యకర్తలకు, నేతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ పార్టీ స్థాయిని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు.
 
పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగే అవకాశమే లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పవన్ పొలిటికల్ గా సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని ఆ లక్ష్యాలను పవన్ సులువుగానే సాధిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెమ్యునరేషన్ పరంగా పవన్ కళ్యాణ్ ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ సంచలన విజయాలను సొంతం చేసుకుంటూ రెండు పడవల ప్రయాణంలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: