డిప్యూటీ సీఎం అయినా.. పవన్ జనసైనికుల కోరిక తీర్చటం కష్టమేనా?

praveen
సినిమాలను వదిలి జనాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను జనసేనానిని అనిపించుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. ఎన్నో విమర్శలు ఎన్నో అవమానాలు ఇంకెన్నో ఇబ్బందులు వీటన్నింటిని ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ప్రజలు తనను ఓడించినప్పటికీ ప్రజల పక్షాన నిలబడే మనిషిని అన్న విషయాన్ని ప్రతిక్షణం నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్.

 పదవి ఉన్నోళ్లే ప్రజలను పట్టించుకోకుండా మొఖం చాటిస్తూ ఉంటే.. అటు ఏ పదవి లేకుండానే ప్రజలకు ఆపద వచ్చిందంటే చాలు నేనున్నా అంటూ భరోసా ఇస్తూ వచ్చారు. ఇలా ప్రజల మనిషిగా ప్రజల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతటి ఘనవిజయాన్ని సాధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన 21చోట్ల విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అంతేకాదు ఇక ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కింగ్ మేకర్ గా మారిపోయారు. ఇక చంద్రబాబు సీఎంగా ఉంటే ఇక సీఎం తర్వాత సీఎం పదవి అయినా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. అంతేకాకుండా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు.

 ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా పవన్ కళ్యాణ్ ఇక జనసైనికుల కోరిక తీర్చడం కష్టమేనా అనే చర్చ జరుగుతుంది. ఇంకేంటి పవన్ డిప్యూటీ సీఎం అయ్యాడు.. పార్టీ అభ్యర్థులందరిని గెలిపించుకున్నాడు కదా ఇంకా ఏం కోరిక తీర్చాలి అనుకుంటున్నారు కదా.. పవన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చూడాలని.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే చూడాలని జనసైనికులు మొదటి నుంచి కోరుకుంటున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి వచ్చినందుకు కాస్త సంతోషంగా ఉన్న.. రానున్న రోజుల్లో పవన్ టిడిపిని వదిలి సొంతంగా పోటీ చేసి ఏపీలో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి.. సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తే చూడాలని అనుకుంటున్నారు జనసైనికులు.


 ఎందుకంటే టిడిపి తో పోటీ చేస్తే గెలిచిన ప్రతిసారి చంద్రబాబు తప్ప మరొకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు. అందుకే టిడిపి నుండి పక్కకు వచ్చి పోటీ చేసి అఖండ మెజారిటీ సాధించి పవన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తేనే జనసైనికుల కోరిక తీరినట్లు అవుతుంది. మరి దశాబ్ద కాలంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో బలమైన స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్న పవన్ జనసైనికుల కోరిక తీర్చడం కష్టమే అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: