షర్మిల: అన్నను ఓడించింది.. అయినా వీడని కష్టాలు..!

Divya
•అన్నను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది.
•సీట్లు గెలిచిన వీడని కష్టాలు
•ముఖ్యమంత్రి దిశగా అడుగులు..

(ఆంధ్ర ప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

వైయస్ షర్మిల.. వైయస్ ముద్దుబిడ్డగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు అనూహ్యంగా ప్రత్యర్థులతో చేతులు కలిపి సొంత కుటుంబంతోనే విభేదాలు తెచ్చుకుని వార్తల్లో నిలుస్తోంది. తన బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న ఈమె.. అతడిని చెంతకు తీసుకున్న అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై కూడా విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్లో చేతులు కలిపిన ఈమె.. అన్నను ఎలాగైనా ఓడించి కాంగ్రెస్ ను ఇక్కడ బలోపేతం చేసి వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలనే పరితపిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మక రచనలు చేసి ప్రజల మన్ననలు పొంది.. జగన్ కు రావాల్సిన ఓట్ల ను చీల్చి జగన్ పరాభవానికి మొదటి కారణం అయ్యింది.
అసలు గత ఐదు సంవత్సరాల క్రితం వరకు కాంగ్రెస్ కనుమరుగవుతోంది అనే వాదన వినిపించింది. అందులో భాగంగా వైఎస్ఆర్సిపి , టిడిపి మాత్రమే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన పార్టీలుగా నిలిచాయి.. కానీ ఈసారి ఎలాగైనా సరే వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించాలని అటు టిడిపి బిజెపి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు.. కాంగ్రెస్ ను మళ్ళీ నిలబెట్టడానికి షర్మిల  బరిలోకి దిగింది. ఇక ప్రసంగాలతో పాదయాత్రలతో రెచ్చిపోయిన షర్మిల ఓట్లను పూర్తిస్థాయిలో చీల్చిందని చెప్పవచ్చు.జనసేన, బిజెపి, టిడిపి  కూటమిగా మూకుమ్మడిగా ఓట్లు చీలకుండా ప్లాన్ చేసుకుంటే.. జగన్ కు రావాల్సిన ఓట్లను చీల్చి ఆయన ఓటమికి కారణమయ్యింది.
అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుమరుగయ్యింది అనుకునే లోపే కొన్ని సీట్లు సాధించిన ఈమె ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 అయితే దానినీ నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న ఈమెకు అధిష్టానం ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పిస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా ఈమెకు బలాబలాలు లేకపోవడం మరొక పెద్ద మైనస్ అని చెప్పవచ్చు కుటుంబం అండ ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే పోరాటం చేసే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఒంటరిగా పోరాడుతోంది అన్న సహాయం లేదు.. తల్లి విజయమ్మ పూర్తిస్థాయిలో సహాయాన్ని అందించలేదు .. ఇలాంటి సమయంలో.. ప్రత్యర్థి పార్టీ అయినా కాంగ్రెస్తో చేతులు కలిపింది. వీళ్ళ తండ్రిని వాడుకున్నట్లే ఈమెను కూడా వాడుకుంటారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. మరి ప్రస్తుతం షర్మిల పరిస్థితి అయోమయంగా మారిపోయింది.. మరి ఈ కష్టాల కడలి నుంచి ఆమె గట్టేక్కేది ఎప్పుడు.. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో అధిష్టానాన్ని పొందేదెప్పుడు.. ఇలాంటి కష్టాల మధ్య షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: