జగన్ పొలిటికల్ లైఫ్ ఇక కష్టమే! అంత ఈజీ కాదు?

Purushottham Vinay

• ఇక జగన్ కష్టాలు మాములుగా ఉండవు! 


• జగన్ ఈ 5 ఏళ్ళు కష్టపడితే వచ్చే 5 ఏళ్లలో సుఖపడవచ్చు! 


• జనాల్లో మద్ధతు పెరగాలంటే జగన్ కష్టపడాల్సిందే! 


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: జగన్ చాలా దారుణంగా ఓడిపోయారు. అయినా కానీ ఆయన ఇంకా వాస్తవ ప్రపంచంలోకి రాలేదని.. ప్రజల నాడిని పసిగట్టడంలో గతంలో సీఎం అయినప్పటినుంచీ వరుసగా విఫలమవుతూనే ఉన్నారని.. అందుకే ఇప్పుడు ఘోర పరాజయం తర్వాత కూడా ఇంకా మార్పు రాలేదని జనాలు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా జగన్ చెప్పే మాటలకూ ఆయన చేసే పనులకూ పొంతనలేకపోతే ఎలా అని ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ తన ఆలోచన మార్చుకొవడం లేదని, తన తప్పులు తెలుసుకోవడం లేడని ఇంకా ప్రజలకు సరైన సంకేతాలు ఇవ్వడం లేదని అంటున్నారు జనాలు.నిజానికి జగన్ కు అత్యంత బలమైన ఓటు బ్యాంక్ ఎస్సీ, క్రీస్టియన్, మైనారిటీ, బీసీలో ఓ సెక్షన్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం చీలినా పైన చెప్పుకున్న సెక్షన్స్ మాత్రం చీలలేదని తెలుస్తుంది. ఇక దాని ఫలితమే 40% ఓట్లని గుర్తు చేస్తున్నారు. 


జగన్ కూడా ఎన్నికల ముందు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకునే ప్రచారాలు చేసుకున్నారు. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు వారికి ఏమి చేయలేదు. చిన్న చిన్న పథకాలు పెట్టారు తప్ప. మంత్రి వర్గం సరిగ్గా లేదు. ఈ కారణాలతో జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోయారు.పైగా తనని చిత్తుగా ఓడించిన ప్రతి పక్షాలని అధికారంలో ఉన్నప్పుడు అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు అధికారం పోయింది. కాబట్టి జగన్ కష్టాలు మాములుగా ఉండవు. అధికార పార్టీ వాళ్ళు జగన్ ని మాములుగా కష్టాపెట్టరు.పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు జగన్ ని వదిలి పెట్టరు. కాబట్టి జగన్ కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ కష్టపడటం. జనాల మద్దతు కోసం కష్టపడాలి. జనాల్లో తిరగాలి. క్షమాపణలు చెప్పుకోవాలి. వీలైనన్ని మంచి పనులు చేసి జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడే తన రాజకీయ జీవితం మళ్ళీ ఈజీ అవుతుంది. లేదంటే చాలా కష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: