కేసీఆర్ కు బిగ్ షాక్..ఒకేసారి 15 మంది జంప్ ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో... ఉద్యమ పార్టీని కకావికలం చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ... గులాబీ పార్టీని... మింగేసే ప్రయత్నం చేస్తోంది. గతంలో కేసీఆర్ తరహాలోనే రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గతంలో గులాబీ పార్టీలో చేర్చుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అంతేకాదు కాంగ్రెస్ లెజిస్టేటివ్ పార్టీని కూడా విలీనం చేసుకున్నారు.
 ఇక చాన్స్ వచ్చిందని రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో గులాబీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పిర్జాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్  ను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే ఏకంగా 15 మంది కార్పొరేటర్లను... కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.  15 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ కావడంతో... ఫిర్జాయిగూడ మున్సిపల్ కార్పొరేషన్.. త్వరలోనే... హస్తగతం కానుంది.
దీంతో... గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలినట్లు అయింది. ఇది ఇలా ఉండగా... ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. భద్రాచలం నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఈ వలసలు... కొనసాగుతూనే ఉన్నాయి.  భద్రాచలం ఎమ్మెల్యే తెల్లo వెంకటరావు,కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కాలేరు యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
 ఇక మరో 19 మంది  గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే... టిఆర్ఎస్ ఎల్ పి  కూడా కాంగ్రెస్లో విలీనం అయ్యే ఛాన్స్ ఉంది. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారట. దాదాపు.. మరో 15 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: