కేవీపీ: జగన్ కోటను కూల్చేందుకు భారీ స్కెచ్.. ఇక వైసీపీ ఖాళీ కానుందా?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హీట్ ఎక్కుతున్నాయి. ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోవడంతో... అక్కడ... జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు... పాలన పైన కంటే వైసీపీ నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఏ క్షణంలో... వైసిపి నేతలను అరెస్టు చేస్తారో అనే భయం లో చాలామంది నేతలు ఉన్నారు. కొడాలి నాని, రోజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు లాంటి నేతలను తెలుగుదేశం ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

ఇలాంటి నేపథ్యంలో... ఇటు వైసీపీ నేతలు కొంతమంది...తెలుగుదేశం కూటమి వైపు చూస్తున్నారట. కూటమి చాన్స్ ఇస్తే ఆ పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. అయితే... ఈ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, వైయస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు కెవిపి రామచంద్ర రావు.. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎసరు పెట్టాడు. తాజాగా... వైసీపీ పార్టీ నేతల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కేవీపీ రామచంద్రారావు.
 చాలామంది వైసిపి నేతలు కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి వచ్చినట్లు... కెవిపి రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో చాలామంది వైసిపి నేతలు పనిచేశారని... వాళ్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే తనతో చర్చలు కూడా చేసినట్లు కెవిపి రామచంద్రరావు... చిట్ చాట్ లో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం కూటమిలోకి వెళ్లేందుకు... వారికి అనేక చిక్కులు ఉన్నాయని... అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు.
 ఇటు వైసీపీలో... ఉన్న బలమైన లీడర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఒకసారి గేట్లు తెలిస్తే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారట. తెలుగుదేశం కూటమిలోకి చేరదామంటే అక్కడ ఉన్న లీడర్లు వైసిపి నేతలను చేర్చుకోవద్దని చెబుతున్నారట. దీంతో కాంగ్రెస్ పార్టీ వైపు చాలామంది నేతలు చూస్తున్నారని కెవిపి రామచంద్రరావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kvp

సంబంధిత వార్తలు: