కాంగ్రెస్ ఎమ్యెల్యేను వణికిస్తున్న కేసీఆర్ ?

Veldandi Saikiran
నారాయణపేట జిల్లాలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చూశారంటే రాజుల సొమ్ము రాళ్ళ పాలు అయిందని మాట గుర్తుకొస్తుందట. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సుమారు కోటి రూపాయల వ్యయంతో కట్టిన ఆఫీస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నాలుగేళ్ల పాటు తన కార్యకలాపాల కొనసాగించారు. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మాత్రం అడుగు పెట్టేందుకు భయపడుతున్నారట. ముఖ్యంగా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఇప్పటివరకు అడుగుపెట్టలేదట. అయితే ఆమె రానందుకు వివిధ కారణాలు చెబుతున్నా.....అందులో ముఖ్యంగా వాస్తు దోషం కారణం బలంగా వినిపిస్తుందట.

నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సుమారు కోటి రూపాయల వ్యయంతో గత ప్రభుత్వంలో క్యాంపు కార్యాలయం నిర్మించారు. 2020 జూలై నుంచి అప్పటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో తన పాలన కొనసాగించారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పర్ణిక రెడ్డి గెలుపొందడం.... రాజేందర్ రెడ్డి ఓటమిపాలవడంతో రాజేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఖాళీ చేసి వెళ్లిపోయారు. అప్పటినుంచి క్యాంపు కార్యాలయం వినియోగంలో లేకుండా పోయిందట.

ఆయా నియోజకవర్గాల్లో తాజాగా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, క్యాంపు కార్యాలయంలో కేంద్రంగా తమ పాలన సాగిస్తుంటే నారాయణపేట ఎమ్మెల్యే మాత్రం ఎస్పి కార్యాలయం సమీపంలో ఉన్న వారి నివాసం నుంచి పనులు సాగిస్తున్నారట. దీంతో గడిచిన ఏడు నెలలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం వినియోగంలో లేకుండా పోయింది. ప్రజల సౌకర్యార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించింది. ఎమ్మెల్యే నివాసంతో పాటు ఎమ్మెల్యే కార్యకలాపాల నిర్వహణ కోసం భవనాలు నిర్మించడంతో ప్రజలు క్యాంప్ కార్యాలయాలకు వెళ్లి సమస్యలు చెప్పుకోవడం.... వివిధ పథకాల అప్లికేషన్లు తీసుకోవడం వంటి పనుల కోసం ఈ ఆఫీస్ లు ఉపయోగపడ్డాయి.

అయితే నాలుగేళ్ల పాటు గత ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తన కార్యకలాపాలను ఇక్కడి నుంచే సాగించినా.....కొత్తగా ఎంపికైనా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి మాత్రం ఇక్కడికి రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తీరా ఎందుకా అని ఆరా తీస్తే ....వాస్తు దోషం వల్లే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్ రెడ్డి ఓటమిపాలయ్యారని చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలయ్యిందట. ఈ కారణం చేత ప్రస్తుత ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి గెలుపొంది నెలలు గడుస్తున్నా ....క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టేందుకు భయపడుతున్నట్లు జోరుగానే చర్చ సాగుతోంది. వాస్తు దోషమే దీనికి ప్రధాన కారణమని చర్చించుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: