తెలంగాణలో టీడీపీ పాగా వేయాలని చూస్తోంది: కేటీఆర్

Suma Kallamadi
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎటువంటి ఘన విజయం నమోదు చేసిందో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో 175కి 175 సీట్లను మేమే సాధిస్తాం అని విర్రవీగిన గత ప్రభుత్వం మెడలు వంచి కింద కూర్చోబెట్టింది కూటమి ప్రభుత్వం. కాగా ఇపుడు బాబు తెలంగాణ పైనా దృష్టి పెట్టినట్లు చాలా స్పష్టంగా కనబడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పార్టీకి అధ్యక్షుడు లేకపోయినా, కేడర్ మాత్రం అలానే ఉందని, ఏపీలో ఘన విజయం సాధించిన తరువాత ఆ కేడర్లో మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చిందనే గుసగుసలు ఇపుడు వినబడుతున్నాయి. మరోవైపు నాటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడి నాయకులు టీడీపీని వీడాల్సి వచ్చింది గానీ టీడీపీపైనా, చంద్రబాబుపైనా తమకు ఎలాంటి వ్యతిరేకతా లేదనేది నిర్వివాదాంశం.
కాగా ఇపుడు ఏపీలో టీడీపీ జెండా రెపరెపలు ఆడడంతో అలాంటి నాయకులంతా తెలంగాణాలో యాక్టివ్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా కేటీర్ అన్న వ్యాఖ్యలు వీటికి మరింత బలం చేకూరేలా చేసాయి. తాజాగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ... తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాపకింద నీరులా ప్రవేశించడానికి ప్లాన్ చేస్తోంది.. జరా జాగ్రత్త! అని తమ పార్టీ కేడర్ ను అలర్ట్ చేసినట్టు వ్యాఖ్యానించారు. అందుకే అక్కడ ఇటీవల చంద్రబాబు - రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టారంటూ మాట్లాడారు. అయితే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తే అది తమకే లాభం అని కూడా మరో మాట అన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే ఆలోచన చంద్రబాబుకి ఉంటే అది మంచి ఆలోచనేనంటూ కితాబిచ్చారు.
అదేసమయంలో అలా మాట్లాడుతూనే బాబు, రేవంత్ కలిసి ఎలాంటి కుయుక్తులు పన్నినా రాబోయే రోజుల్లో మేమే అక్కడ మరలా అధికారం చేపట్టబోతాం అన్నది నగ్న సత్యం అంటూ జోశ్యం చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... చంద్ర బాబు ఇప్పుడు ఎన్డీయేలో కీలకంగా ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాలకూ ఎక్కువ నిధులు తేవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ విధంగా తెలంగాణకు మేలు జరగడంలో ఆయన పాత్ర ఉపయోగపడితే కెసిఆర్ ఖచ్చితంగా స్వాగతిస్తాం అని అన్నారు. ఈ క్రమంలోనే... ఏపీలో తాము బీఆరెస్స్ పెట్టినప్పుడు, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదని... సమీప భవిష్యత్తులో మేము కూడా ఏపీలో పాగా వేయబోతాం అని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: