అప్పుడు మహర్జాతకులు ఇప్పుడు కష్ట జాతకులు.. కేసీఆర్ జగన్ టైమ్ అస్సలు బాలేదుగా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కొన్ని నెలల క్రితం వరకు ఒక వెలుగు వెలిగారు. ఈ ఇద్దరు నేతలకు ప్రజల్లో సైతం ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు నేతల పరిస్థితి, ఈ ఇద్దరు నేతల పార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. వైసీపీ, బీ.ఆర్.ఎస్. రెండు తెలుగు రాష్ట్రాలలో పుంజుకుంటాయో లేదో అనే కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవ్తున్నాయి.
 
అప్పుడు మహర్జాతకులు ఇప్పుడు కష్ట జాతకులు అయ్యారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్ జగన్ టైమ్ అస్సలు బాలేదంటూ నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అధికారంలో ఉన్న పార్టీలపై వ్యతిరేకత పెరిగితే మాత్రమే ఈ నేతలకు పొలిటికల్ గా కలిసొచ్చే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.
 
కేసీఆర్ కు వయస్సురిత్యా రాష్ట్రంలో పార్టీని ముందుకు నడిపించడం కూడా సులువు కాదని చెప్పవచ్చు. పార్టీ బాధ్యతలను ఎవరికైనా అప్పగిస్తే మాత్రమే తెలంగాణలో బీ.ఆర్.ఎస్ పరిస్థితి మారుతుంది. రాజకీయాలలో ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం సహజమనే సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి హామీలను నిలబెట్టుకుంటే మాత్రమే ఆ పార్టీపై ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది.
 
కూటమి సర్కార్ ఉచిత ఇసుక విషయంలో మాట తప్పిందని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినా ఉచిత ఉసుక భారం అలాగే కొనసాగనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ కూటమిపై ప్రజల్లో వస్తున్న కొంతమేర వ్యతిరేకతను ఎంతమేరకు క్యాష్ చేసుకుంటారనే ప్రశ్నలకు సంబంధించి జవాబులు దొరకాల్సి ఉంది. ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్న కేసీఆర్, జగన్ లకు ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలన మార్పులు చోటు చేసుకుంటుండగా ఓటర్ల నాడిని పట్టుకోవడంలో రాజకీయ పార్టీలు వరుసగా సక్సెస్ కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: