అతిగా ఆశపడ్డ KCR.. అతిగా బాధపడుతున్నాడుగా?

Purushottham Vinay

• కెసిఆర్కు అహంగా మారిన 10 సంవత్సరాల అధికారం!


• కెసిఆర్కు అత్యాశని మిగిల్చిన 10 సంవత్సరాల అధికారం!


• కెసిఆర్.. అత్యాశతో కూడిన అహాన్ని అణిచివేస్తే మంచిది!


తెలంగాణ - ఇండియా హెరాల్డ్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా కెసిఆర్ దశాబ్దం పాటు ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆ 10 సంవత్సరాల ఊపులో మొదటి 10 సంవత్సరాలు జనాలని బాగా ఊపి తన వైపు తిప్పుకున్నాడు. మిగతా ఐదు సంవత్సరాలు కెసిఆర్ ఊపుతో జనాలకి కళ్ళు తిరిగాయి. దాంతో 10 సంవత్సరాల తరువాత తెలంగాణ ప్రజలు కెసిఆర్ ఊపుని ఆపేశారు. మొదటి 5 సంవత్సరాలు బాగానే పరిపాలన చేసిన కెసిఆర్ రెండోసారి గెలిచాక నా అంతటి వాడు లేడని అహం పెంచుకున్నారు. అహంతో పాటు అత్యాశ కూడా పెరిగింది. సరే అత్యాస పెరిగినా పర్లేదు కానీ దానికి అహం అనేది యాడ్ అవ్వడంతో జనాలు తీర్పునిచ్చి గద్దె దించి ఆహాన్ని తొక్కేసారు. అయినా అహం అణిగిందా అంటే ఇంకా అణగలేదనే తెలుస్తుంది. అహంతో కూడిన అత్యాసతో పార్టీ పేరు టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చాడు. దాంతో పార్టీ జాతకం కూడా మారిపోయింది. జనాలకు సేవ చెయ్యడం నిజమైన గెలుపు. అలా చేస్తే గెలుపు ఈజీగా వస్తుంది. 


దాన్ని గాలికొదిలేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే అత్యాశ వల్ల కేసీఆర్ ప్రస్తుతం చాలా దారుణాతి దారుణంగా ఓడిపోయి బాగా బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.కేసీఆర్ తనని తాను సమర్థించుకొని ప్రతి పక్షాల పై విమర్శలు చేసినా కూడా ఆ విమర్శలను పట్టించుకునే నాదులే కరువయ్యారు. కవిత నిర్దోషి అని తేలి జైలు నుంచి విడుదలైన కూడా కెసిఆర్ పరిస్థితి మారదు. మారే అవకాశం కూడా లేదు. కెసిఆర్ జాతకం మార్చేది ఎవరయ్యా అంటే ప్రస్తుతానికి ఆయన కొడుకు కేటీఆర్ అనే చెప్పాలి. ఆయన కూడా తన తండ్రిలా కాకుండా ఆహాన్ని అణుచుకొని అత్యాస పోకుండా పార్టీపై పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తే పార్టీ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కేసీఆర్, కేటీఆర్ కలిసి సరైన దారిలో అడుగులు వేయకపోతే పార్టీ భవిష్యత్తు షెడ్డుకి పోవడం పక్కా. అతిగా ఆశపడ్డ మగవాడు చరిత్రలో సుఖపడినట్టు లేదు అని రజినీకాంత్ నరసింహ సినిమాలో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ని కెసిఆర్ అర్ధం చేసుకుంటే భవిష్యత్తులో నిలదొక్కుకుంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: