2024లో ఏపీ రాజధానిని ఊహించిన ఏఐ.. ఫోటోలు చూస్తే ఫిదా..

Suma Kallamadi
2024లో ఏపీ రాజధానిని ఊహించిన ఏఐ.. ఫోటోలు చూస్తే ఫిదా..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఇది దాదాపు అన్నింటిలో విలీనం అవుతోంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఏఐ టూల్స్ తీసుకొచ్చాయి. ఇవి చాలా సమర్థవంతంగా ఆన్సర్లను ఇస్తున్నాయి. అంతేకాదు ఈ ఇమేజ్‌లు క్రియేట్ చేసి ఇస్తున్నాయి. భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించే ఫోటోలు క్రియేట్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, 2047లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎలా ఉంటుందో చూపించమని ఏఐని అడిగితే, అది కొన్ని చిత్రాలను రూపొందించింది. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.
AI ప్రకారం, 2047లో అమరావతి ఇలా ఉంటుంది.
 2047 నాటికి భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్యం జరుపుకుంటుంది. అప్పటికి అమరావతికి విశాలమైన రోడ్లు, వాటి పక్కన భారీ భవనాలు ఉంటాయని AI అంచనా వేసింది.
AI అమరావతిలో రైల్వే వ్యవస్థ ఎలా ఉంటుందో కూడా ఊహించింది. అదే మనుషులే ఎవరూ కూడా ఊహించని విధంగా అమరావతి రైల్వే సిస్టమ్‌ కొత్త రూపాన్ని కలిగి ఉంటుందని చూపించింది. ఇది రైల్వే స్టేషన్‌కు ఎర్రకోట రూపాన్ని ఇచ్చింది. ఇమేజ్ లో చూసినట్లు రైలు అద్భుతంగా కనిపిస్తుంది.
విజయవాడలో 2047 నాటికి కృష్ణా నదీ తీరం ఎలా మారుతుందనే ప్రశ్నకు ఏఐ ఒక అందమైన దృశ్యాన్ని అందించింది. విజయవాడ బాగా అభివృద్ధి చెందితే నది మధ్యలో కూడా స్పెక్టాక్యులర్స్ బిల్డింగ్స్ నిర్మితమవుతాయని ఈ ఇమేజ్ ద్వారా ఏఐ తెలియజేసింది.
విజయవాడ సిటీ ఇతర నగరాల కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని ఏఐ ఊహించింది. అంతే కాదు ఇక్కడ దేవాలయాలు ఆధునిక హంగులతో నెక్స్ట్ లెవెల్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తాయని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ రూపంలో తెలియజేసింది.
 
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఎలా అభివృద్ధి చెందుతుందో చూపించాలని అడిగినప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతమైన దృశ్యాన్ని అన్ వీల్ చేసింది.
ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ 2047 నాటికి ఎలా ఉంటుందో ఇమేజిన్ చేయాలని అడగ్గా AI కళ్లు చెదిరే సీన్‌ను ఆవిష్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aoi

సంబంధిత వార్తలు: