వైసీపీ : హైదరాబాద్‌ నుంచి చంద్రబాబును గెంటేశారా...?

Veldandi Saikiran

రేవంత్‌, చంద్రబాబు సమావేశాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న సాయంత్రం హైదరాబాద్ లో ఆంధ్ర,తెలంగాణ ఇద్దరు సీఎంలు కలిశారని... ఇద్దరి సీఎంల మధ్య సమావేశంలో చాలా వాటికి చర్చలు లేవు...ప్రధానంగా ఈ సమావేశం దేనికి అనేది కూడా వివరణ లేదని ఆగ్రహించారు. కొన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందని కొన్ని మీడియావాళ్ళకి లీకులు ఇచ్చారని... ఇద్దరి సీఎంలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారు అనుకున్న లేదు..మాట్లాడిన మంత్రుల మధ్య కూడా క్లారిటీ లేదని మండిపడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగాక అనేక అంశాలు పెడింగ్ లో ఉన్నాయి.విభజన జరిగాక మొదటి సీఎంగా చంద్రబాబు పని చేసాడన్నారు. మొదటి సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు ఉమ్మడి రాజధానిని వదిలేసి పారిపోయి వచ్చాడని... తప్పు చేసాడు కాబట్టి మెడ పట్టి చంద్రబాబు హైదరాబాద్ నుండి గెంటేసారని చురకలు అంటించారు. చంద్రబాబు గత పాలనలో అన్ని తాత్కాలిక భవనాలను ఎందుకు కట్టాడు....రాష్టాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు.

7 వేల కోట్లు విద్యుత్ బకాయిలు మనకి రావాల్సి ఉందని... శ్రీశైలం,నాగార్జున సాగర్ మధ్య నీటి వాటాల మధ్య చర్చలు జరిగాయా..దాని మీద మాట్లాడారా అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం చేతికి వెళ్ళిందని...ఆంధ్రప్రదేశ్ కి తీర మార్గం ఉంది దాని మీద వాటా కావాలని అడిగారు అని తెలుస్తుందని పేర్కొన్నారు.టీటీడీ లో తెలంగాణకి వాటా కావాలని అడిగినట్టు తెలుస్తుంది... విలీన మండలాల్లను తెలంగాణలో కలపాలి అని డిమాండ్ చేస్తున్నారు..దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీశారు.
కృష్ణ జల్లాలో వాటా తెలంగాణ ప్రభుత్వం అడిగిందా...మీరు సమాధానం చెప్పాలి....తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ మంత్రులు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. చంద్రబాబు రెండు రాష్టాలు రెండు కళ్ళు అంటున్నారు... అంటే వాళ్ళు డిమాండ్ చేసినవి అన్ని నిజాలే అనుకోవాలి హా అని ఆగ్రహించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి సీఎం మీ రాజకీయలు వేరుగా చేసుకోండి....ఆంధ్రప్రదేశ్ హక్కులను చంద్రబాబు వదిలేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: