2029 : సీఎం టార్గెట్ ఆ నలుగురికి ఛాన్స్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో 2024 లో ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపించాయి.. అయితే ఇప్పటికీ ఎన్నికలు జరిగి నెల రోజులు కావస్తున్న అప్పుడే 2029 ఎన్నికలు అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. 2029లో కచ్చితంగా వైసీపీ పార్టీ మీమే గెలుస్తామంటూ ఓడిన రోజు నుంచే తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ పైన కార్యకర్తల పైన టిడిపి నేతలు దాడులు చేయిస్తున్నారని ఎవరికీ అధికారం శాశ్వతం కాదు అని అలా అనుకుంటే పొరపాటు అంటూ కూడా హెచ్చరించడం జరిగింది.

ఇదంతా వైసిపి తీరు అనుకుంటే కాంగ్రెస్ కూడా ఈ రేసులో కనిపించేలా ఉన్నది వైఎస్ షర్మిల ఏపీ సీఎం అని ఆమె వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు కూడా మద్దతుగా నిలిచారు. అలాగే వైయస్సార్ జయంతి వేడుకలలో కూడా మళ్లీ అదే మాట అనడం జరిగింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే షర్మిల ఈ రోజున కూడా ఎక్కడ గెలిచిన సత్తా చాటుకోలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలవాల్సి ఉన్నది.

కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్ తన సత్తా చూపించి మరి వైయస్సార్ కాంగ్రెస్ పెట్టి 2014లో ఓడిపోయిన 2019లో సింగల్ గా పోటీ చేసి భారీ ఘనవిజయాన్ని అందుకున్నారు జగన్. కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికైతే బలంగా ఉంది.టిడిపి వారసుడిగా నారా లోకే సీఎం చేయాలని అందులో చాలామంది నేతలు అనుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే 2029లో టిడిపి పార్టీ నుండి నారా లోకేష్ సీఎం పదవిలో నిలబడేలా  కనిపిస్తున్నారు.

జనసేన పార్టీ నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ ని సీఎంగా చేయాలని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఉపముఖ్యమంత్రి పదవిగా బాధ్యతలు చేపట్టారు పవన్ కళ్యాణ్. మరి 2029లో ఆరు నూరైనా సింగల్ గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని అభిమానులు తెలుపుతున్నారు. 2029 ఎన్నికలలో పవన్ కళ్యాణ్, జగన్ ,షర్మిల ,నారా లోకేష్ వంటి వారు సీఎం సీటు రేసులో ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: