తెలంగాణ : ఫస్ట్ ప్లేస్ లో ఉండవలసిన బీజేపీ ఎందుకు వెనకబడిపోయింది.. అతన్ని దించడమే కారణమా..?

Pulgam Srinivas
ఎన్నో పోరాటాల తర్వాత, ఉద్యమాల తర్వాత 2014వ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీకి మంచి అసెంబ్లీ స్థానాలు రావడంతో ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2018'లో రెండవ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ కి ఈ సారి తిరుగులేకుండా పోయింది. ఈ పార్టీ కి భారీ మొత్తం లో అసెంబ్లీ స్థానాలు రావడంతో రెండవ సారి కూడా ఈ పార్టీ జెండా తెలంగాణలో రెపరెపలాడింది. కేసీఆర్ రెండవ సారి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు.

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో తిరుగులేకుండా పోయింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు అన్నీ మారాయి. వరుసగా రెండుసార్లు గెలిచినందుకు ప్రజలు మార్పు కోరుకున్నారో ... మరే కారణాలు కానీ బీఆర్ఎస్ పార్టీ పై వ్యతిరేకత ప్రారంభం అయింది. ఇక ప్రత్యామ్నాయ పార్టీ ఏది అనుకునే సమయంలో బండి సంజయ్ ని బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించింది. ఈయన ద్వారా తెలంగాణలో బిజెపికి మంచి ఓపు వచ్చింది. ఇక ఆ తర్వాత కొన్ని ఉప ఎన్నికలలో ,  ఎంపీ ఎన్నికలలో బిజెపికి మంచి స్థానాలు రావడం మొదలు అయింది. దానితో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బిజెపి అనే స్థాయికి ఎదిగింది. ఇక అలాంటి సమయంలోనే బండి సంజయ్ ని పక్కన పెట్టడంతో మళ్లీ బీజేపీ క్రేజ్ పడిపోయింది.

అలాంటి సమయంలోనే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైన రచనలు చేసుకుంటూ వచ్చాడు. ఇక మెల్లిగా బిజెపి క్రేజ్ తగ్గడం, కాంగ్రెస్ క్రేజ్ పెరగడం స్టార్ట్ అయింది. దానితో అప్పటికే బీఆర్ఎస్ పై ప్రజలు వ్యతిరేకతతో ఉండడం, ప్రత్యామ్నాయ పార్టీని కోరుకుంటూ ఉండడం, ఇక బిజెపి అసెంబ్లీ ఎన్నికలలో మంచి క్యాండిడేట్లను కూడా సరైన వారిని నిలబెట్టకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ వైపు చూడడం మొదలు పెట్టారు. దాని ప్రభావంతో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలు వచ్చి అధికారంలోకి రాగా , బీఆర్ఎస్ రెండవ స్థానంలోనూ, బిజెపి మూడవ స్థానంలోకి వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: