కేసీఆర్‌ 2028: బీఆర్‌ఎస్‌ కు ప్రాణం పోసేందుకు రంగంలోకి ట్రబుల్ షూటర్?

Veldandi Saikiran
* హరీష్‌ రావు కు బీఆర్‌ఎస్‌ పగ్గాలు
* హరీష్‌ రావు, కేటీఆర్‌ ఇద్దరూ కలిసి పని చేసేలా ప్లాన్‌
* కేసీఆర్‌ సై అయిపోవాలి
* ఉద్యమకారులకు ప్రాధాన్యత
* 2028 లక్ష్యంగా పార్టీ పునర్ణిర్మాణం


తెలంగాణ రాష్ట్రంలో... గులాబి పార్టీ అత్యంత గడ్డు పరిస్థితిలను ఎదుర్కొంటోంది. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...తెలంగాణ తీసుకువచ్చిన గులాబీ పార్టీని... దారుణంగా ఓడించారు ప్రజలు. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న... గులాబీ పార్టీని ఊడ్చేశారు.  మొన్నటి ఎన్నికల్లో కేవలం 39 స్థానాలకు పరిమితమైన గులాబీ పార్టీ... పార్లమెంట్ ఎన్నికల్లో జీరో స్థానాలకే... ఆగిపోయింది.

టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు అందరూ బయట పార్టీలకు వెళ్తున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ టికెట్ తో గెలిచిన ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరుగుతోంది. ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్న ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. ఇంకా బడా లీడర్లు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లేదా బిజెపి పార్టీలో చేరే ఛాన్స్ ఉంది.

ఇలాంటి నేపథ్యంలో.... గులాబీ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సోషల్ మీడియా టీమ్ ను చాలా బలంగా తయారు చేయాలి కేసీఆర్. అంతేకాకుండా పార్టీ పూర్తి బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించాలి. తెలంగాణ రాష్ట్రంలో.. మాస్ ఫాలోయింగ్ ఉన్న హరీష్ రావు.. యూత్ ను బాగా ఆకట్టుకోగలడు.

ఇప్పటివరకు కేసీఆర్ వ్యూహాలు ఫలించాయి. ఇక వెనుక ఉండి పార్టీని నడిపించాల్సి ఉంది కేసీఆర్. హరీష్ రావు అలాగే కేటీఆర్ లకు ఇద్దరికీ.. గులాబీ పార్టీని అప్పగించి కెసిఆర్ వెనుక ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలి.  అలా అయితేనే గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఆ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తారా ? లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: