సీఎంల భేటీ: ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయా..?

Veldandi Saikiran
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య శ‌నివారం జ‌ర‌గ‌నున్న స‌మావేశంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ప్ర‌ధానంగా ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని మెజారి టీ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. కానీ, అవి ఏమేర‌కు ప‌రిష్కారం అవుతాయ‌నేది ప్ర‌శ్నే. ఎందుకంటే.. తెలంగాణ కోరుతున్న గొంతెమ్మ కోరిక‌లు తీర్చాల‌నేది అటు వైపు నుంచి వినిపిస్తున్న వాద‌న‌. కానీ, వీటిని అసంబ‌ద్ధ‌మ‌ని.. గ‌తంలో చంద్ర‌బాబు చెప్పారు. త‌ర్వాత వ‌చ్చిన‌.. జ‌గ‌న్ కూడా చెప్పారు. ఇక‌, మిగిలిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉన్నా.. ప‌రిష్క‌రించ‌డం లేదు. ఇవేమిటో చూద్దాం..

1. జ‌నాభా ప్రాతిప‌దికన ఏపీలో ఎక్కువ మంది జ‌నాభా ఉన్నారు(2014 లెక్క‌ల ప్ర‌కారం) దీని ప్ర‌కారం ఆస్తులను పంచాల‌ని విభ‌జ‌న చ‌ట్టం చెబుతోంది. కానీ, చేయ‌డం లేదు. ఇవి ప‌రిష్కారం కావాలి.
2. ఏపీలో ఉన్న 1888 తెలంగాణ ఉద్యోగులను ఆ రాష్ట్రం తీసుకోవాలి. అలాగే, తెలంగాణలో ఉన్న 1447 మంది ఉద్యోగులను ఏపీకి బదిలీ చేయాలి. ఇది సాధ్య‌మే. కానీ, చేయ‌డం లేదు.
3. తెలంగాణ పౌర స‌ర‌ఫ‌రాల‌ కార్పొరేషన్‌ వాడుకున్న క్యాష్‌క్రెడిట్‌పై 2024 జూన్‌ 30 నాటికి జమ అయిన వడ్డీ రూ.138 కోట్లు చెల్లించాలి.  కానీ ఇవ్వ‌డం లేదు. దీనిని ఏపీనే చెల్లించాల‌ని మొండి వాద‌న‌ను వినిపిస్తున్నారు.
4. విభ‌జ‌న నాటికి ఉన్న ఆహార సబ్సిడీ రూ.842 కోట్లలో తెలంగాణ వాటా 276 కోట్లు చెల్లించాలి. ఇవి కూడా ఇవ్వ‌డం లేదు.
5. ఉమ్మ‌డి రాష్ట్రంలో15 ఈఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్పులను రెండు రాష్ట్రాల మధ్య పంచాలి. వీటి పంప‌కం తేలికే. అయినా.. తెలంగాణ ఒప్పుకోవ‌డం లేదు.
6. షెడ్యూల్‌ 9లో ఉన్న సంస్థలకు సంబంధిం చి షీలా బిడే కమిటీ ఇచ్చిన 89 సంస్థల విభజన పూర్తిచేయాల్సి ఉంది. కానీ, దీనికి కూడా తెలంగాణ త‌మ గొంతెమ్మ కోరిక‌లు తీర్చే ప్ర‌య‌త్నం చేస్తే.. తాము ఒప్పుకొంటామ‌ని చెబుతోంది. అంతేకాదు.. అస‌లు ఆస్తుల పంపిణీ.. జ‌నాభా ప్రాతిప‌దిక‌న కాదు.. వ‌న‌రుల ప్రాతిప‌దికన చేయాల‌ని కోరుతోంది. ఇది సాధ్యం కాద‌ని తెలిసినా.. ప‌ట్టుబ‌డుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: