జగన్ తప్పులను బాబు, లోకేశ్ సరిదిద్దుతున్నారుగా.. ఒక్క కాల్ తో లెక్క సరి చేస్తున్నారుగా!

Reddy P Rajasekhar
2019 నుంచి 2024 మధ్య వైసీపీ పాలనకు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రజల విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. జన రంజక పాలన అందించే విషయంలో బాబు అదుర్స్ అనిపించుకోగా జగన్ మాత్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పార్టీ పుంజుకోలేని పరిస్థితి తెచ్చారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ నేతలకు, ప్రజలకు మధ్య గ్యాప్ పెంచి వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించింది.
 
అయితే చంద్రబాబు, నారా లోకేశ్ జగన్ తప్పులు సరిదిద్దుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ గతంలో ఏ తప్పులు చేశారో వాటికి చంద్రబాబు, కూటమి నేతలు ఆ తప్పులు అస్సలు చేయడం లేదు. బూత్ లెవెల్ నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రతి ఒక్కరికీ చంద్రబాబు, లోకేశ్ ఒక్క కాల్ దూరంలో ఉంటూ ఏపీ ప్రజల ప్రశంసలను అందుకుంటూ ఉండటం గమనార్హం.
 
చంద్రబాబు సీఎంగా ఈ నెల 1వ తేదీన రాష్ట్రంలోని అవ్వాతాతలకు 7,000 రూపాయల పింఛను పంపిణీ చేసి అవ్వాతాతల ప్రశంసలు అందుకున్నారు. వచ్చే నెల నుంచి చంద్రబాబు 4,000 రూపాయల పింఛను పంపిణీ చేయనున్నారు. అన్ని వర్గాల నేతలను కలుపుకొని బాబు, లోకేశ్ ముందుకెళుతుండగా జగన్ మాత్రం సొంత సామాజిక వర్గాన్ని సైతం దూరం చేసుకున్నారనే చెప్పాలి.
 
వైసీపీ కార్యకర్తల, నేతల అవినీతిని అడ్డుకోకపోవడం కూడా జగన్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. తాజాగా ఒక మంత్రి భార్య ఇష్టానుసారం ప్రవర్తిస్తే స్వయంగా చంద్రబాబు జోక్యం చేసుకుని అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంతో ఉన్న విభజన సమస్యలను సైతం పరిష్కరించేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. బాబు పాలనను చూసి జగన్ ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అయినా మాజీ సీఎం జగన్ లో మార్పు వస్తుందేమో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: