విజయ్ కి ఆ ఫ్లాప్ మూవీతో అలాంటి ఎఫెక్ట్.. అందుకు కారణం ఆ స్పీచ్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీ తో హీరో గా విజయాన్ని అందుకొని ఈ సినిమాతో తనకంటూ తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయనకు అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీవాలా విజయాలతో సూపర్ సాలిడ్ గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది.

టాక్సీవాలా మూవీ విజయం తర్వాత ఈ నటుడు నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు విజయ్ ఈ సినిమా విజయం పై ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. అందులో భాగంగా ఈయన ఈ సినిమా కచ్చితంగా 200 కోట్లు కలెక్షన్ లను వసూలు చేస్తుంది అను పలు సందర్భాలలో చెపుతూ వచ్చాడు.

ఇక తీరా చూస్తే ఈ సినిమా విడుదల కావడం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోకపోవడం దానితో ఘోర పరాజయాన్ని అందుకోవడం జరిగిపోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది ఓకే ... కాకపోతే ఈ సినిమా విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఈ మూవీ గురించి చాలా ఎక్కువగా మాట్లాడడం ఏకంగా 200 కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తుంది అని చెప్పడం ఇలాంటి మాటలు అన్ని ట్రోల్ అయ్యాయి. ఇక లైగర్ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఓకే ... కాకపోతే ఈ సినిమా గురించి విజయ్ కనక రిలీజ్ ముందు అతిగా మాట్లాడకపోయి ఉండుంటే విజయ్ పెద్దగా ట్రోల్ అయ్యేవాడు కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: