కన్నడలో పుష్ప 2 రికార్డ్ బిజినెస్..!
ఈ క్రమంలో సినిమాలో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా కొన్ని ఎలిమెంట్స్ పెడుతున్నారట. ఇక సినిమా అంచనాలకు తగినట్టుగానే బిజినెస్ కూడా చేస్తుంది. అల్లు అర్జున్ రేంజ్ కి తగిన బిజినెస్ తో పుష్ప 2 అదరగొట్టేస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా కర్ణాటకలో పుష్ప 2 ఆల్ టైం రికార్డ్ బిజినెస్ చేసిందని టాక్. కన్నడలో ఈ సినిమాను కోట్లు కుమ్మరించి మరీ రైట్స్ కొనేశారని తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా కన్నడ రైట్స్ ని 32 కోట్లకు కొనేశారట. కన్నడలో ఈ రేంజ్ బిజినెస్ ఏ హీరో చేయలేదు. అల్లు అర్జున్ కి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా దాన్ని ఇప్పుడు కర్ణాటకలో కూడా పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. కచ్చితంగ బన్నీ మార్క్ బంపర్ హిట్ గా పుష్ప 2 ని మలచేలా చేస్తాడని అంటున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 2 తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారన్నది చూడాలి. పుష్ప 2 ముందు చాలా పెద్ద సవాళ్లే ఉన్నాయని తెలుస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంగీతం పరంగా కూడా దేవి అదరగొట్టేస్తున్నాడని టాక్. అల్లు అర్జున్ పుష్ప 2 ఆడియన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా దాన్ని మించి ఉండేలా సుక్కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.