ఇంచు దూరంలో ఆ రికార్డ్? కల్కి దెబ్బకు బద్దలవుతున్న బుక్ మై షో?

Purushottham Vinay

ప్రభాస్, నాగ్ అశ్విన్  కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇక 8 రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో ఏకంగా రూ. 431.55 కోట్ల  వసూళ్లు వచ్చాయి. ఇక కల్కి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 8 రోజుల్లో రూ. 800 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.కల్కి 2898 ఏడీ సినిమా ఆ మొదటి రోజు రూ. 95.3 కోట్ల షేర్ వసూలు చేసింది.  

రెండో రోజైన శుక్రవారం రూ. 59.3 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా శనివారం బిజినెస్ ఊపందుకోగా రూ. 66.2 కోట్ల షేర్ రాబట్టింది.  ఆదివారం నాడు బిజినెస్ మరింత పుంజుకుని మొత్తం రూ. 88.2 కోట్లు రాబట్టింది.తరువాత సోమవారం రూ. 34.15 కోట్లు, మంగళవారం నాడు రూ. 27.05 కోట్లు, బుధవారం రూ. 22.7 కోట్లు రాబట్టింది. గురువారం నాడు కల్కి 2898 ఏడీ రూ. 21.8 కోట్లు, శుక్రవారం నాడు రూ. 16.9 కోట్లు వసూలు చేసి మొత్తం రూ. 431.75 కోట్ల షేర్ రాబట్టింది. ఇదిలా ఉండగా బుక్ మై షోలో కూడా రికార్డ్ స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి.

ఇప్పటికే 9 మిలియన్ టికెట్స్ పైగా అమ్ముడు పోగా 10 మిలియన్ టికెట్స్ రికార్డుకి ఇంచు దూరంలో ఉంది కల్కి. ఇక 8 రోజుల్లో 800 కోట్ల గ్రాస్ రాబట్టిన చిత్రంగా ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 వసూళ్ళని దాటి బాహుబలి 2 తరువాత స్థానంలో నిలిచింది. అంతేగాక గతేడాది కోలీవుడ్ లో టాప్ సినిమాలుగా నిలిచిన జైలర్, లియో సినిమాల రికార్డులని కూడా ఈజీగా బద్దలు కొట్టేసింది. వాటి లైఫ్ టైం వసూళ్ళని ఎప్పుడో దాటేసిన కల్కి తాజాగా వాటి ఓవర్ సీస్ వసూళ్ళని కూడా  దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: