సాహో మూవీలో హీరోయిన్గా మొదటి ఆప్షన్ ఎవరో తెలుసా.. అంతా ఓకే.. చివరి నిమిషంలో క్యాన్సల్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితం సాహో అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి శ్రద్ధ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇకపోతే బాహుబలి లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ఆ సమయంలో ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకున్న మిగతా భాషల ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.

దానితో ఈ మూవీ యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రద్ధ కపూర్ కి ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా మొదటి ఆప్షన్ కాదట. ఒక ముద్దుగుమ్మను అనుకొని ఆల్మోస్ట్ ఆమెతో షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దాము అనుకునే సమయంలో ఆమె ఈ సినిమా నుండి తప్పుకోవడంతో శ్రద్ధా కపూర్ ని తీసుకున్నారట. ఆ బ్యూటీ ఎవరు ..? ఆమె ఎందుకు ఈ మూవీ నుండి తప్పుకుంది అనే వివరాలను తెలుసుకుందాం ... సాహో సినిమాలో మొదట హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి కత్రినా కైఫ్ ను అనుకున్నారట.

అందులో భాగంగా ఈమెకు ఈ సినిమా కథను వినిపించగా ఆమె కూడా ఈ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దాము అనుకునే సమయానికి కత్రినాకు మరో భారీ క్రేజ్ ఉన్న సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చిందట. దానితో ఈమె నాకు ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది. ప్రస్తుతం నేను ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో మూవీ యూనిట్ కూడా ఏమీ చేయలేక శ్రద్ధా కపూర్ కి ఈ సినిమా కథను వినిపించి హీరోయిన్ పాత్ర కోసం అడిగారట. దాంతో ఈమె కూడా ఈ సినిమా కథ నచ్చడంతో హీరోయిన్గా చేస్తాను అని చెప్పిందట. అలా ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా ఎంపిక అయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: