ఏపీ: లోకేష్ కి ఛాన్స్ ఇవ్వను అంటున్న బాబు..?

Divya
ప్రస్తుతం చంద్రబాబు వయసు 74 పదులు వయసు దాటితోంది. అయితే చంద్రబాబు ఇంకా యువకుడుగానే పని చేస్తూ దూసుకుపోతున్నారు. అలాగే తనతో ఎవరూ కూడా పరుగులు తీయలేరంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు చంద్రబాబు. గడిచిన 30 ఏళ్ల క్రితం చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యారు.. అప్పుడు ఎనర్జీ ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయని చంద్రబాబు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చంద్రబాబుని పాత బాబుని చూస్తున్నారని ఆయన మాటలలోనే వింటూ ఉన్నాము. పాలన విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళుతున్నారు.

ముఖ్యంగా చంద్రబాబు అధికారుల నే కాదు మంత్రులను కూడా పరుగు పెట్టించేలా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మంత్రులు లోకేష్ పైన కూడా పలు రకాల సెటైర్లు వేయడం జరిగింది.. మొదటిసారి సీఎం అయినప్పుడు తన కుమారుడు కుర్రాడు.. నీకు తెలియక పోవచ్చు.. కానీ ఇప్పుడు అంతా పాలనలో జోరు పెంచాల్సిందే అని తన కొడుకుకి సైతం ఏమాత్రం మినహాయింపు ఇవ్వకుండా తేల్చేశారు  చంద్రబాబు.. అంతేకాకుండా లోకేష్ ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.. అందుకే ఇప్పట్లో లోకేష్ కు ఎలాంటి అవకాశాలు ఇవ్వమంటూ తెలియజేశారు.

ఈ మధ్యన టిడిపి సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి లాంటి వారు లోకేష్ ఈ టర్మ్ లో సీఎం కావచ్చు అంటూ తనదైన విశ్లేషణతో తెలియజేసినప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చు అనే విషయం ఇప్పుడు రాజకీయాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏపీలో చంద్రబాబు సీఎం గా ఉంటేనే అది సరిగ్గా పాలన గాడిలో పడుతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీఎం సీటు అంటే ఒక ముళ్ళ కిరీటంలో మారిపోయింది.. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్నవారు అయితే ఈ పదవికి ఎలాగోలగా నెట్టుకోస్తారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారసులుగా ఎవరు ఈ సీట్లో కూర్చోలేరని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: