ప్రతీకారం కాదు.. ప్రజల అభివృద్ధి ప్రధాన లక్ష్యం - పవన్..!

Divya

•ప్రతీకారం ముఖ్యం కాదు ప్రజల అభివృద్ధి ప్రధానం..
•నిరుద్యోగులకు అండగా పవన్ కళ్యాణ్
•మహిళా సాధికారతే ముఖ్యం..

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2008లో తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజలకు సహాయం చేయాలన్న కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ప్రజారాజ్యం పార్టీని ఎక్కువకాలం నిలపలేక చిరంజీవి కాంగ్రెస్లోకి ఆ పార్టీని 2011 లో విలీనం చేస్తే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు.. ఆ తర్వాత జనసేన పార్టీని స్థాపించిన ఈయన దాదాపు 13 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేయాలి అని పరితపించారు... అధికారంలోకి రాకపోయినా అధికారం కోసం పాకులాడకుండా తనకు చేతనైన సహాయాన్ని ప్రజల కోసం చేస్తూ వచ్చారు.. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎన్నో రకాలుగా విమర్శించారు.. వ్యక్తిగతంగా దూషించారు కానీ అవేవీ కూడా ఆయన పట్టించుకోలేదు..మూడు పెళ్లిళ్లు అన్నారు.. ప్యాకేజ్ స్టార్ అన్నారు.. ఇవే కాదు ఎన్నో విమర్శించే మాటలు ఆయనపై గుప్పించారు .. కానీ ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ వాటిని పట్టించుకోలేదు.. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోయారు.

ఇక అందులో భాగంగానే ఈసారి 2024 ఎన్నికలలో జనసేన కూటమిలో భాగంగా పోటీ చేసి 21 స్థానాలలో 21 కైవసం చేసుకొని 100% స్ట్రైక్ రేటుతో భారీ విజయాన్ని దక్కించుకోవడమే కాదు.. డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు కూడా చేపట్టారు.. పదవిలో లేనప్పుడే ప్రజలకు ఎంతో చేసిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెన్ని చేస్తారో అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూశారు.. ఇక అనుకున్నట్టుగానే తనను విమర్శించిన వారిపై ప్రతీకారం తీర్చుకోకుండా ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబుతో మాట్లాడి విడుదల చేయించిన పవన్ కళ్యాణ్.. త్వరలోనే అర్హులైన వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దిశగా అడుగులు వేస్తున్నారు.
అంతేకాదు మహిళలకి కూడా అండగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం ఉన్న కాలంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది.. అందుకే వారి సాధికారత వారి అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ మహిళలకు అన్ని విధాల మంచి చేకూరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ఒక అమ్మాయి 9 నెలలుగా మిస్సయింది.. ఆ అమ్మాయి రాక కోసం ఎవరూ పట్టించుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ఢిల్లీలో ఉన్న అమ్మాయిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.. ఇవే కాకుండా అమ్మాయిల కోసం మరెన్నో చేస్తున్నారు ..అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే ఈ రేంజ్ లో పనులు వేగంగా చేస్తూ దూసుకుపోతున్నారంటే ఐదేళ్ల పరిపాలనలో ప్రజల అభివృద్ధికి ఏ రేంజ్ లో ఆయన పాటుపడతారో అర్థం చేసుకోవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: