జగన్‌ కు "రియల్‌" దెబ్బ...అందుకే 11 సీట్లు ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ.. అత్యంత దారుణంగా ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ... ప్యాలస్కు పరిమితం కావడం, ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం... ఐ బ్యాక్ కు ఇచ్చిన ప్రాధాన్యత వైసిపి కార్యకర్తలకు ఇవ్వకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే... కర్ణుడి చౌకు వంద కారణాలు అన్నట్లు.... వైసిపి పార్టీ ఓటమికి కూడా చాలా కారణాలే ఉన్నాయి.
 చాలా తప్పుల కారణంగా వైసిపి పార్టీ... కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. 175 స్థానాలకు 175 కొడతానని... ప్రసంగాలు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి....  చివరికి ప్రతిపక్ష స్థానాన్ని కూడా సంపాదించుకోలేకపోతున్నాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో...  వైసిపి పార్టీ ఓటమికి మరో కారణం కూడా ఉందని తాజాగా తేలిపోయింది. అదేంటంటే.. ఏపీలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోవడం. ఏపీలో మూడు రాజధానుల... అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో... రియల్ ఎస్టేట్ ఢమాల్ మంది.
ముఖ్యంగా గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, విజయవాడ లాంటి ప్రాంతాలలో... భూముల ధరలు అమామంతం పడిపోయాయి. సామాన్యుడు కూడా కొనుగోలు చేసే స్థాయికి... ఏపీ భూముల ధరలు పడిపోయాయి. దీంతో... రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించాలనుకున్న చాలామంది... తీవ్రంగా నష్టపోయారు. 5 లక్షలు పెట్టి ల్యాండ్ కొంటే పది లక్షలు రావాలని.. ఎవరైనా అనుకుంటారు.
 కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత... ఏపీలో ఆ పరిస్థితి కనిపించలేదు. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో... జనాలు ఎవరు కూడా భూములు కొనుగోలు చేసేందుకు... ఆసక్తి చూపించలేదు. ఇక.. దాని ఫలితంగా...గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, విజయవాడ లాంటి ప్రాంతాలలో గెలవాల్సిన సీట్లను కూడా కోల్పోయింది. 2019 ఎన్నికల్లో... ఇక్కడ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసిపి...మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. ఇలా జగన్మోహన్ రెడ్డికి రియల్ దెబ్బ తగిలింది. దీంతో ఏపీలో వైసీపీ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: