ఇండియన్ 2: మిస్ యూనివర్స్ అందాలతో అదిరిపోయిన క్యాలెండర్ సాంగ్?

Purushottham Vinay

కల్కి 2898 ఏడీ సినిమాలో కలిగా కమల్ హాసన్ పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్నా దుమ్ము రేపింది. నిజానికి కమల్ అసలు పాత్ర రెండో భాగంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు కమల్ హాసన్ జూలై 12న భారతీయుడు 2 రూపంలో వస్తున్న సంగతి తెలిసిందే. భారతీయుడు 2 రిలీజ్ కి ఇంకా రెండు వారాల సమయం కూడా లేదు. అందుకే ఇండియన్ 2 మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి సాంగ్స్ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. తాజాగా క్యాలెండర్ సాంగ్ పేరిట మరో లిరికల్ సాంగ్ ని మూవీ టీమ్ విడుదల చేసింది. ఆ సాంగ్ చూసిన తర్వాత డైరెక్టర్ శంకర్ తన మార్క్ చూపించాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సాధారణంగా డైరెక్టర్ శంకర్ సినిమా అంటే సాంగ్స్ మీద భారీ  అంచనాలు ఉంటాయి. 


ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ లో ఆ టచ్ కనపడలేదు అనే అభిప్రాయాలు వినిపించాయి. కానీ, తాజాగా వచ్చిన సాంగ్ మాత్రం వాటిని ఈజీగా తుడిచిపెట్టేసింది. శంకర్ తన సినిమా లో సాంగ్స్ లో కచ్చితంగా ఒరిజినల్ లొకేషన్స్ లో తీసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే ఈ సాంగ్ ని కూడా ఒక లైవ్ లొకేషన్ లోనే శంకర్ ప్లాన్ చేశారు. ఈ సాంగ్ చూడటానికి మాత్రం బాగా రిచ్ గా ఉంది. అలాగే సాంగ్ లో డైరెక్టర్ శంకర్ వింటేజ్ టచ్ కనిపిస్తోంది. ఈ సాంగ్ కోసం ఏకంగా 2017 మిస్ యూనివర్స్ డెమి లేయ్ టెబోని శంకర్ దింపేశాడు. ఆమె హాట్ హాట్ అందాలు ఈ పాటలో అదిరిపోయాయి. మోడల్స్ ని వాడటంలో శంకర్ స్టైలే వేరు అని మరోసారి నిరూపించాడు.ఇప్పటి దాకా ఏఆర్ రెహ్మాన్ లేకపోవడం సినిమాకి కాస్త మైనస్ అనుకున్నారు. కానీ, అనిరుధ్ రవిచందర్ ఈ సాంగ్ తో ఆ కామెంట్స్ ని కూడా సైలెంట్ చేసినట్లు అయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ క్యాలెండర్ సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: