కల్కి 2898 AD : హిందీలో "బాహుబలి 2" రికార్డ్ జస్ట్ మిస్.. కానీ నెంబర్ వన్ ఆ సినిమానే..?

Pulgam Srinivas
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , మృణాల్ ఠాకూర్ , శోభన ముఖ్య పాత్రలలో నటించగా ... దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ చిన్న చిన్న క్యామియో పాత్రలలో నటించారు. దీపికా పదుకొనే , అమితా బచ్చన్ ఈ మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలలో నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఈ మూవీ లో దిశా పటాని హీరోయిన్గా నటించగా ... వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీ దత్ కూతురు అయినటువంటి స్వప్న దత్ ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ మూవీ జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన నాలుగవ రోజు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. అందులో భాగంగా ఈ మూవీ హిందీ ఏరియాలో కూడా నాలుగవ రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఈ మూవీ నాలుగవ రోజు హిందీ ఏరియాలో 40.15 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియా నుండి విడుదల అయిన సినిమాలలో హిందీ ఏరియాలో "కే జి ఎఫ్ చాప్టర్ 2" మూవీ విడుదల అయిన నాలుగవ రోజు 50.35 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా ... బాహుబలి 2 సినిమా విడుదల అయిన నాలుగవ రోజు హిందీ ఏరియాలో 40.25 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాత స్థానంలో కల్కి మూవీ నాలుగవ రోజు హిందీ ఏరియాలో 40.15 కోట్ల కనెక్షన్లను చేసి మూడవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: