పానీ పూరి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బ్యాన్ దిశగా అడుగులు..!

Divya
పానీ పూరి అంటే తినని వారంటూ ఎవరూ ఉండరు.. సాయంత్రం అయితే చాలు చాలామంది వీటిని తినడానికే మక్కువ చూపుతూ ఉంటారు. అయితే పానీ పూరి వల్ల చాలానే ఎఫెక్ట్లు ఉన్నాయనే వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వాటిని తయారు చేసేటప్పుడు చాలామంది అసభ్యకరమైన పనులను చేస్తూ ఉంటారనే విధంగా పలు వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉన్నాయి. కానీ తాజాగా కర్ణాటక, తమిళనాడులోని ఈ పానీ పూరిని బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా పానీపూరీలో క్యాన్సర్ కారక పదార్థాలు చాలానే ఉన్నట్లుగా వైద్యుల సైతం గుర్తించడంతో తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా పాని పూరీలో అనేక వ్యాధులకు కారణమవుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం తెలియజేశారు. ముఖ్యంగా అమ్మేవారు అందుకు సరైన నాణ్యతను పాటించలేదని కూడా ఫైర్ అవుతున్నారు. దీంతో పానీ పూరి తిన్న వారు ఎక్కువగా డయేరియా, టైఫాయిడ్, జాండీస్ వంటి వ్యాధులకు కూడా గురవుతున్నారట. తాజాగా కర్ణాటకలో 250 నమూనాలు సేకరించగా ఇందులో 40 భద్రత ప్రమాణాలు సరిగ్గా లేవని గుర్తించారట.

వీటిలో బ్రిలియంట్ బ్లూ, టాట్రాజైన్ వంటి రసాయనాలను కూడా కలుపుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారట .వీటివల్ల క్యాన్సర్ కారణమయ్యే పదార్థాలు కలిగే ఉన్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా పానీపూరీలో రంగులు వాడడం వల్లే ఎందుకు ముఖ్య కారణమని అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రాంతాలలో గోబీ కబాబు అంటే ఇతర స్నాక్స్లు వాడకూడదని నిషేధం కూడా విధించారు. దాదాపుగా తమిళనాడులో 80 చోట్ల ఉన్న 1500 పానీ పూరి షాపులలో పరిశీలించగా అక్కడ నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించలేదని అధికారులు గుర్తించారు అలాగే చాట్ మసాలాలు ఇటలీన్ యాక్సిడెంట్ ఎక్కువగా ఉండడంతో పానీపూరిని బ్యాన్ చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం త్వరలోనే అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా రాబోతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: