నల్లమిల్లి: కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ పార్టీని ఉద్దేశించి... అనపర్తి బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే.. కాంగ్రెస్ పార్టీలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేందుకు... జగన్మోహన్ రెడ్డి... సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన పై... కీలక వ్యాఖ్యలు చేశారు.
 కాంగ్రెస్ పార్టీలో వైసీపీ పార్టీని... విలీనం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని... అందులో భాగంగానే బెంగళూరు ప్యాలెస్ కు జగన్ వెళ్లినట్లు... బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.  దీనికోసం డీకే శివకుమార్ తో జగన్ చర్చలు జరుపుతున్నట్లు... సంచలన ఆరోపణలు కూడా చేశారు రామకృష్ణారెడ్డి. అయితే... ఈ విలీనం పట్ల జగన్మోహన్ రెడ్డి ఒక కండిషన్ కూడా పెట్టినట్లు ఆయన వివరించారు.
 తన చెల్లెలు వైయస్ షర్మిల ను కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమివేయాలని... అప్పుడే తన వైసిపి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టినట్లు... చెప్పుకొచ్చారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓడిపోయిన బాధలో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు...  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చురకలు అంటించారు. అయితే ఇప్పటివరకు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అటు నలుగురు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటారో లేదో.... అని కూడా ఆయన వెల్లడించారు.
 చివరికి వైసీపీకి ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా ఆయనతో ఉంటారో లేదో అనే పరిస్థితి నెలకొంది అని... అందుకే వైసిపి పార్టీని విలీనం చేసేందుకు జగన్ సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పై పులివెందుల కార్యకర్తలే.... దాడి చేశారని కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు తెర లేపారు. కడప జిల్లాకు జగన్ వస్తే... ఒక వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేదా మాజీ ఎమ్మెల్యేలు కానీ ఆయనను చూసి ఎందుకు వెళ్లలేదని.. చురకలు అంటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: