పార్టీ పిరయించిన వారికి గట్టి బుద్ధి చెప్పిన జనాలు... అందులో విశాఖ లీడర్..?

Pulgam Srinivas
కొంతమంది నేతలు ఒక పార్టీ సిద్ధాంతాలను నమ్మి దానికే కట్టుబడి ఉంటారు. అలాంటి వారికి పార్టీలో మంచి గుర్తింపు, హోదా దక్కుతూ ఉంటాయి. మరి కొంత మంది ఏ పార్టీ అధికారం లోకి వస్తే ఆ పార్టీలోకి చేరుతుంటారు. దానికి ప్రధాన కారణం తమ దందాలు అన్ని సజావుగా జరుపుకోవాలని , అలాగే అధికార పార్టీలో ఉన్నట్లు అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనే కారణాలతో కొంత మంది గెలిచిన వెంటనే తమ పార్టీ అధికారంలోకి రానట్లయితే అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాంటి వారి పప్పులు ప్రతిసారి ఉడకవు. ఏదో ఒక సారి వారికి గట్టి దెబ్బ తగులుతుంది.

ఇక ఈ సారి ఎన్నికలలో అలాంటి గట్టి దెబ్బ తిన్నవారిలో విశాఖ సౌత్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన వాసుపల్లి గణేష్ ఒకరు. వాసుపల్లి గణేష్‌ 2009 లో తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ విశాఖ పట్నం నియోజక వర్గం నుండి టీ డీ పీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస రావు చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆయన 2014 లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి వై సీ పీ అభ్యర్థి కోలా గురువులు పై 2019 లో వై సీ పీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాస రావు పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

వాసుపల్లి గణేష్‌ టీ డి పి ని విడి వై సీ పీ కి మద్దతుగా ఉండడం తో టీ డీ పీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26 న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈయన 2019 లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచిన ఆ తర్వాత వై సి పి పార్టీలోకి వెళ్లిపోయారు. ఈసారి ఈయన విశాఖ సౌత్ నుండి వై సీ పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కూటమి నుండి పోటీ చేసిన జనసేన అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ పై ఓడిపోయారు. ఇలా పార్టీ పురాయించిన వారిలో జనాల చేత తిరస్కరించిన బడిన నేతలలో వాసుపల్లి గణేష్ ఒకరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: