ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు మాజీ సీఎం లేఖ..

Suma Kallamadi
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయ్యారు. సాధారణంగా రూల్ ప్రకారం మొత్తం సీట్లలో కనీసం 10 శాతం సీట్లు గెలుచుకుంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇందులో 10 శాతం అంటే 17.5. ఈ ఆఫ్ శాతం అనేది పరిగణలోకి తీసుకోరు అందువల్ల వైసీపీ కనీసం 18 సీట్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది సాధించలేకపోయింది అందువల్ల ప్రతిపక్ష హోదా జగన్ పార్టీకి లేదని చాలామంది అంటున్నారు. అందుకే అసెంబ్లీలో కనీస ప్రాధాన్యత కూడా వారికి లభించదు అని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు లేఖ రాశారు. 'ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం సీట్లలో కనీసం 10 శాతం సీట్లు కైవసం చేసుకోవాలని  ఎక్కడా రాసి లేదు. విపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీకే ప్రతిపక్ష హోదా కల్పించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజా సమస్యలను అసెంబ్లీ వినిపించే ఛాన్స్ ఉంటుంది. కానీ, ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ కూటమి నేతలు నాపై విరుచుకుపడేలా చూస్తున్నారు.' అంటూ మాజీ సీఎం జగన్ లేఖలో రాసుకొచ్చారు.
 ఇప్పుడు జగన్ రాసిన లేక ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రతిపక్ష హోదా తమకే దక్కుతుందని స్పష్టంగా లేఖలో చెప్తే తెలిపారు. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను ఎదుర్కొంటారా అనేదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జగన్ కు అసెంబ్లీలో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం కల్పిస్తే అసెంబ్లీ సమావేశాలు కచ్చితంగా మారతాయి. జగన్ ఎవరికీ భయపడరు కాబట్టి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేస్తానని చెప్పి చేయని పనులను ఆయన హైలెట్ చేసే అవకాశం ఉంది.  జగన్ కు అవకాశం కల్పించడం వల్ల చంద్రబాబు ఒక మెట్టు ఎత్తుకు ఎదుగుతారని కూడా చెప్పవచ్చు. చూడాలి మరి ఏం చేస్తారో, అయ్యన్నపాత్రుడు ఏం రిప్లై ఇస్తారో కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: