జనసేన: 11 రోజుల పాటు దీక్షలో పవన్ కళ్యాణ్ ?

Veldandi Saikiran
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంచి జోష్ లో కనిపిస్తున్నాడు. మొదటిసారిగా ఎమ్మెల్యే కావడం... వెంటనే ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం.. అంతేకాకుండా ఇతర కీలక శాఖలు చంద్రబాబు ఇవ్వడం... ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ కు ఆఫర్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏది పట్టిన ఇప్పుడు బంగారమే అవుతుంది. దాదాపు పది సంవత్సరాల పాటు... పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు పవన్ కళ్యాణ్.

ఆ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 11 రోజులపాటు దీక్ష చేసేందుకు... ముందుకు వచ్చారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈనెల 26వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి... వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు పవన్ కళ్యాణ్. జూన్ 26వ తేదీ అంటే రేపటి నుంచి దాదాపు 11 రోజులపాటు... అమ్మవారి దీక్షలో ఉంటారు పవన్ కళ్యాణ్.

వారాహి మాత దీక్షలో భాగంగా.... ఈ 11 రోజులపాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు పవన్ కళ్యాణ్. కేవలం పండ్లు, పాలు ఇతర ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు జనసేన అధికారిక ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండగా 2023 జూన్ మాసంలో... వారాహి యాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో .... ఎన్నికల ప్రచారం కోసం ఈ వారాహి యాత్రను ప్రారంభించారు.

దీని కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయించుకొని... ఆ వాహనానికి వారాహి పేరు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ యాత్ర కూడా... విజయవాడ అమ్మవారి నుంచి ప్రారంభించారు. దీంతో ఇప్పుడు.. తన మొక్కు తీర్చుకునేందుకు...11 రోజులు దీక్ష చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ దీక్షకు అన్ని ఏర్పాట్లు చేశారు జనసైనికులు. కాగా పిఠాపురం నియోజకవర్గంలో... 70 వేల పైచిలుకు ఓట్ల విజయం సాధించారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: