ఏపీ: బిజెపి ఎంట్రీ పై ట్విస్ట్ ఇచ్చిన మిధున్ రెడ్డి..!

Divya
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం సరికొత్త పరిణామాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసిపి పార్టీ చాలా ఘోరంగా ఓడిపోవడంతో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం వైసీపీ అధినేత మాట్లాడి ఎవరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దు.. కేసులు పెట్టిన భయపడవద్దు అంటూ తెలియజేశారు. అయితే ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డి బిజెపిలోకి చేరుతున్నారని ప్రచారం గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నది. తాజాగా ఈ విషయం పైన మిథున్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు ఎంపీలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి పార్టీని ఆశ్రయించబోతున్నారంటూ పలువురు నేతలు వైరల్ గా చేస్తున్నారు. ఏపీలో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ నలుగురు లోక్సభ ఎంపీలు ఉన్నారు. ఇందులో మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నారని చాలా బలంగా వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన ఆయన స్పందిస్తూ నిన్నటి రోజున లోక్ సభ పార్లమెంట్ నేతగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బిజెపిలో చేరాల్సిన కర్మ తనకి పట్టలేదని ఘాటుగానే రిప్లై ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే లక్ష్యంగా తాను పార్లమెంటులో ఏపీ తరఫున మాట్లాడుతానంటు తెలియజేశారు.

గత కొద్దిరోజులుగా వైసిపి కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డి పై వస్తున్న పుకార్లకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చినారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను కూడా బిజెపిలో చేరాలని మిధున్ రెడ్డి ఒత్తిడి తెచ్చుకున్నారని మరొక పక్క ప్రచారం చేస్తూ ఉండడంతో ఈ విషయాలను మిథున్ రెడ్డి  ఖండించారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎంపీగా ప్రమాణం చేసిన మిథున్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు కేవలం కొంతమంది నేతలే కావాలని సృష్టిస్తున్నారనే విధంగా తెలియజేశారు. గతంలో కూడా ఇలాంటి ప్రచారాలు చాలానే జరిగాయి.. వాటన్నిటిని ఎవరు పట్టించుకోవద్దండి అంటూ తెలిపారు మిధున్ రెడ్డి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: