మోడీ: అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ..గర్భగుడిలోకి నీరు?

Veldandi Saikiran
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరో ఊహించని షాక్ తగిలింది. మోడీ హయాంలో ఇటీవల నిర్మించిన అయోధ్య రామ మందిరంలోకి వర్షం నీరు వస్తోంది. ఏకంగా అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి నీళ్లు రావడం... ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో... గత ఆరు నెలల కిందట... రామ మందిరాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో ప్రముఖులు వచ్చారు.

అయితే ఈ రామ మందిరం ప్రారంభించి అర్ధ సంవత్సరం కూడా కాకముందుకే...  ప్రధాన గర్భాలయంలో నీరు లీకేజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయట. అయోధ్యలో కూడా వర్షాలు పడ్డాయి. ఈ తరుణంలోనే అయోధ్య రామ మందిరంలోకి... నీరు లీకేజీ అవుతుందని అక్కడి అర్చకులు చెబుతున్నారు.

ఇక ఇదే అంశంపై అయోధ్య రామ మందిరం ఆలయ ప్రధాన అర్చకులు... సత్యేంద్ర  దాస్ మాట్లాడుతూ... చిన్నపాటి వర్షానికి ఆలయం పైకప్పు నుంచి నీళ్లు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. బాల రాముని విగ్రహాన్ని ప్రతిష్టించిన చోట నీరు లీకవుతోందని... సత్యేంద్ర దాస్ స్పష్టం చేశారు. ఈ నీళ్ల లీకేజీ తీవ్రమైన సమస్య అని... అయోధ్య రామ మందిరం కట్టిన వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

లేకపోతే.. రామ మందిర ఆలయానికి  భంగం కలుగుతుందని ఆయన ఆందోళన చెందారు. దీనిపై రెండు రోజుల్లోనే చర్యలు తీసుకొని పరిష్కారం చేయాలని... ఆలయ అర్చకులు తెలిపారు. అయితే ఈ లీకేజీ వర్షం నీరా? లేక డ్రైనేజీ మార్గం నుంచి వచ్చి నీళ్ల అనేదానిపై కూడా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా... 1800 కోట్లతో రామమందిరాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. జనవరి 22వ తేదీన ఎంతో ఆర్భాటంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు. రామ మందిరంతో ఉత్తరప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేయాలని అనుకున్నారు. కానీ అయోధ్య ఉన్న లోక్సభ పార్లమెంటు స్థానాన్ని కూడా బిజెపి గెలుచుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: