నారా లోకేష్ పై బ్రాహ్మణి స్పెషల్ పోస్ట్..!!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. వారి జాతకాల ప్రకారం మంచి రోజు చూసుకొని మంత్రులుగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. ఇక ఈరోజు విద్యా, మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం నాలుగో బ్లాక్లో ఉన్న తన కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తమ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కీలక మెగా డీఎస్సీ విధి విధానాల ఫైలు పై తన తొలి సంతకం చేశారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఆసక్తికర పోస్ట్ చేశారు. లోకేష్ పై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఐటీ, మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోని 208వ నంబర్‌ గదిలోకి లోకేష్‌ ప్రవేశించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన ఐదు ఫైళ్లను పరిశీలించేందుకు మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ సంతకం చేసి, సోమవారం సమావేశం కానున్న మంత్రివర్గానికి పంపారు.

అయితే.. లోకేష్‌ మంత్రి బాధ్యతలు స్వీకరించడంపై నారా బ్రహ్మణి ఆసక్తికర పోస్ట్ చేశారు. 'అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఈడీ వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావ్. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్లకు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు. నీ సమర్ధతతో నేటితరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబపరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ నారా లోకేష్' అంటూ నారా బ్రహ్మణి సోషల్ మీడియాలో  పోస్ట్‌ చేశారు.గ‌తంలో లోకేశ్ పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధితో పాటు ఐటీ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. అదే విష‌యాన్ని బ్రాహ్మ‌ణి ప‌రోక్షంగా గుర్తు చేశారు. అప్ప‌ట్లో ప‌ల్లెల‌ను అభివృద్ధి చేసి వాటి రూపురేఖ‌లు మార్చావ‌ని లోకేశ్‌ను బ్రాహ్మ‌ణి ప్ర‌శంసించారు. తాజాగా స‌చివాల‌యంలోని నాల్గో బ్లాక్‌లో త‌న చాంబ‌ర్‌లో ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖ‌ల బాధ్య‌త‌ల్ని లోకేశ్ చేప‌ట్టారు.ఈ శాఖ‌ల్ని ఎంతో సాహ‌సంతో లోకేశ్ చేప‌ట్టిన‌ట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ శాఖ‌ల‌తో నేటి త‌రంతో పాటు భ‌విష్య‌త్ త‌రాల జీవితాల్ని మార్చ‌గ‌ల‌వ‌నే న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని భ‌ర్త‌పై ఎంతో న‌మ్మ‌కాన్ని ఆమె చాటుకున్నారు. కుటుంబ ప‌రంగా తమ స‌హ‌కారం వుంటుంద‌ని ఆమె వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: