ఏపీ : పరిపాలనలో కోడ్ సిస్టం ఫాలో అవుతున్న డిప్యూటీ సీఎం..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంతటి కీలకపాత్రను పోషించారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో జనసేన అనే పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడమే లక్ష్యంగా ముందుకు సాగాడు.అయితే అప్పుడు రాష్ట్ర పరిస్థితులను బట్టి సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకి సపోర్టుగా నిలిచి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలకపాత్రను పోషించాడు. ఆ తర్వాత 2019 లో పవన్ కళ్యాణ్ సొంతంగా తన పార్టీ తరపున రెండు చోట్ల పోటీ చేశారు. అయితే పోటీ చేసిన రెండు చోట్ల కూడా తీవ్రమైన ఓటమిని చవిచూశాడు పవన్ కళ్యాణ్.ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్‌గా మారారు.కూటమికి ప్రచారం చేసి మంచి విజయాన్ని సాధించి పెట్టేలా చూసారు .పవన్ కి అత్యంత కీలకమైన శాఖ లతో కూడిన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు లభించాయి.దాంతో పవన్ తనకు దక్కిన శాఖల విషయంలో పూర్తి అధ్యయనం చేస్తున్నారు ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తుంది.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి గెలిచింది.. రెండు ఎంపీ సీట్లలో పోటీ చేసి, రెండు గెలుచుకుంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో పోటీచేసిన 23 స్థానాల్లో 23 చోట్ల (21 ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు) గెలిచి జనసేన పార్టీ వందకు వందశాతం స్ట్రైక్ రేట్ సాధించడంతో అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపుతున్నారు. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం వరుస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు.ప్రజా సమస్యలను కార్యాలయం వద్ద కుర్చీ వేసుకుని మరి వింటున్న ఆయన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, పోలీసులతో అప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతున్నారు. పవన్ ఒక విధంగా చూస్తే ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన రాజకీయంగా ఇపుడు సీరియస్ పొలిటీషియన్ అని చెప్పాల్సి ఉంది.అయితే, తాజాగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పౌరసరఫరాల శాఖ, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే క్యూఆర్ ద్వారా గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలని సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ లింక్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: