ఆంధ్రులని ఊరిస్తున్న ప్రత్యేక హోదా? బాబు అనుకుంటే నెరవేరడం పక్కా?

Purushottham Vinay

•గాయపడ్డ ఆంధ్రులకు ఆశ కలిగిస్తున్న ప్రత్యేక హోదా!


•అప్పుడు అందని ద్రాక్షాగా ఉన్న ప్రత్యేక హోదా ఇప్పుడు అందేలా ఉంది!


•ప్రత్యేక హోదా తెచ్చి ఆంధ్రులు చేసిన మేలుకు బాబు ఋణం తీర్చుకుంటారా?


•వచ్చిన అవకాశాన్ని బాబు సద్వినియోగం చేసుకుంటారా?


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ : విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం కష్టాలే కావు.. ఎన్నో అవమానాలు కూడా ఎదురుకుంటుంది. అసలు ఆంధ్రులకు ఏమాత్రం ఇష్టం లేకుండా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. సరే విభజన జరిగింది.. దానికి తగ్గట్టు  పరిహారం అయినా  దక్కిందా అంటే అదీ లేదు. కంటి తుడుపు చర్యలుగా విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా ఆనాడు ప్రధానమంత్రి ఇచ్చిన హామీల అమలు ఇంతవరకు జరగనే లేదు. పార్లమెంట్లో మన ఎంపీలు చేసింది ఏమి లేదు.2014లో బీజేపీ చేతిలో టీడీపీ ఉన్నా.. పెద్దగా నోరు విప్పలేని పరిస్థితి. అందుకే ఈ విభజన హామీల గురించి టీడీపీ పెద్దగా డిమాండ్‌ చేయలేదు. అసలు ముఖ్యమైన ప్రత్యేక హోదా లేదూ.. ప్యాకేజీతో సర్దుకు పోండి అంటే ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చేసింది.


న్యాయంగా చెప్పాలంటే ఆంధ్రులకి జరిగిన అన్యాయానికి, దెబ్బకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అనేది రావాలి. దాని కోసం మన నాయకులు గట్టిగా పోరాడాలి. కానీ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరగలేదు. చంద్రబాబు హయాంలో కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రా ప్రజలు చంద్రబాబుకి మంచి అవకాశం ఇచ్చారు. 4వ సారి ముఖ్య మంత్రిని చేశారు. కాబట్టి బాబు ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెస్తారని ఆంధ్రా ప్రజలు ఆశపడుతున్నారు. అప్పుడు బాబుకి సాధ్యం కాలేదు. ఇప్పుడు చంద్రబాబు గట్టిగా పూనుకుంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది. ఆంధ్రా ఎంపీలు పార్లమెంటులో ఈ ప్రస్తావన తెస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. అసలు ఏమాత్రం చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై కృతజ్ఞత భావం ఉన్నా ఈ పని చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇది మన హక్కు. కేంద్రాన్ని ప్రశ్నించడం మన బాధ్యత. ఆ బాధ్యతని బాబు భుజాన వేసుకోవాలి. ఆంధ్రా అభివృద్ధికై పాటు పడాలి. అలా పాటు పడితేనే జనాల్లో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటారు. పైగా బీజేపీతో కలిశారు. మోడీని మచ్చిక చేసుకున్నారు. ఇంతకంటే మంచి అవకాశం ఇక వస్తుందా? అంటే రావొచ్చు.. రాకపోవచ్చు.. కాబట్టి ఈ ఛాన్స్ బాబు మిస్ చేయకూడదు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని పట్టుబట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నెరవేర్చాలి. మరి కొన్ని కోట్ల ఆంధ్రుల కలలని బాబు ఎంత వరకు సుసాధ్యం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: