బాబు మరో 10 ఏళ్ళు ఆంధ్రాని ఏలాలంటే.. ఇలా చెయ్యాల్సిందే?

FARMANULLA SHAIK
•ఆంధ్రా అభివృద్ధి జరగాలంటే బాబు మోడీని ప్రశ్నించాల్సిందే!
•ఆంధ్రులిచ్చిన అవకాశాన్ని బాబు సద్వినియోగం చేసుకుంటారా?
•ఆంధ్రా ఎంపీలు పార్లమెంటులో గళం విప్పి ఆంధ్రాకి మేలు చేస్తారా?
 
(అమరావతి - ఇండియా హెరాల్డ్) : కేంద్రంలో ఎన్డీయే కూటమి మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఎంపీల కష్టం ఖచ్చితంగా ఉంది. ఆంధ్రులు చంద్రబాబుని గెలిపించి ఆయనకి మరోసారి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి పోటీ చేసిన 21 మంది ఎంపీలు కూడా సునాయాసంగా గెలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రా అభివృద్ధి కోసం బాబు కేంద్రంతో కుస్తీ పడితే మరో పదేళ్లు ఆంధ్రాకి రాజు అవ్వడం పక్కా అంటున్నారు ఆంధ్రులు.బాబు ఆంధ్రాని టాప్ లో నిలబెడతారా అనే చర్చ సైతం జరుగుతోంది. కేంద్రం టీడీపీ ఎంపీలకు ఇప్పటికే మంచి  పదవులను కేటాయించింది. తన హామీలను అమలు చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడం చంద్రబాబు ముందు ఉన్న పెద్ద సవాల్. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తే కేంద్రం కూడా ఏపీపై దృష్టి పెట్టే అవకాశం పుష్కళంగా ఉంది. అలా ఎంపీలని గైడ్ చేసే బాధ్యత కూడా చంద్రబాబు పైనే ఉంది. ఎందుకంటే గతంలో వైసీపీ ఎంపీల బాగోతం తెలిసిందే. అలా జరగకుండా బాబు జాగ్రత్తలు తీసుకోవాలి.
మంచి విషయం ఏమిటంటే కూటమికి మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆంధ్రాకి మరింత ప్రాధాన్యత ఇచ్చే దిశగా అడుగులు వేయనున్నారని తెలుస్తుంది. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారు. కూటమి తన హామీలను అమలు చేస్తే మాత్రమే రాబోయే రోజుల్లో ప్రజల్లో కూటమిపై పాజిటివ్ ఒపీనియన్ కొనసాగే అవకాశాలున్నాయి.అందుకే కేంద్రం నుంచి ఆంధ్రాకి రాబట్టాల్సిన నిధుల, ఏపీ అప్పులని తీర్చే బాధ్యత కూడా చంద్రబాబుపైనే ఉంది. ఇవన్నీ కూడా ఆంధ్రా ఎంపీలు తమ మాటల ద్వారా ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి కచ్చితంగా తీసుకెళ్ళాలి. అలా చంద్రబాబు వారిని ట్రైన్ చెయ్యాలి.ఆంధ్రా ఎంపీలు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగ పడే అంశాలని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తూ ఆ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలి. అప్పుడే చంద్రబాబు ఆంధ్రా జనాల మెప్పు పొంది రాబోయే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: