నారా లోకేష్: మంత్రిగా ఆన్ డ్యూటీ.. పేరు నిలబెట్టుకునేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎట్టకేలకు 2024 ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో మంత్రిగా కూడా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. ఈ రోజున మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే నేడు మంత్రివర్గ సమావేశం కూడా ఉండడంతో ఆయన పదవి బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే ఇప్పటివరకు నారా లోకేష్ బాధ్యతలను చేపట్టక పోవడానికి కారణం ఆయన ఛాంబర్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం. ఈరోజు ఉదయం 9:45 నిమిషాలకు నారా లోకేష్ బాధ్యతలను కూడా స్వీకరించినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో ఉంటూ పలు రకాల విధులను కూడా నిర్వహించారు నారా లోకేష్. ముఖ్యంగా తన చాంబర్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారట. అలాగే మెగా డిఎస్సీకి సంబంధించిన ఫైలు పైన లోకేష్ మొదటి సంతకాన్ని చేసినట్లు తెలుస్తోంది.16, 347 పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాలకు సంబంధించి క్యాబినెట్లో ఫైల్ పైన నారాలోకి సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే నారా లోకేష్ బాధ్యతలను స్వీకరించిన వెంటనే అటు మంత్రులు వంగలపూడి అనిత, టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బోండా ఉమ తదితర నేతరు లోకేష్ పుష్పగుచ్చాలని అందించి అభినందనలు తెలియజేశారు.

గతంలో లోకేష్ కు ఐటి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో రాష్ట్రంలో విద్యాశాఖ పైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టి ఈ క్రమంలోనే ఆ శాఖను మరింత బలోపేతం చేసే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అలాగే సదుపాయాలను కూడా మౌలికంగా కల్పించాలని ఉద్దేశంతోనే నారా లోకేష్ బాధ్యతలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి నారా లోకేష్ తన బాధ్యతలను సైతం సక్రమంగా నెరవేర్చి విద్యార్థులకు నిరుద్యోగులకు వరాలను అందించి పేరు సంపాదిస్తారా లేకపోతే విమర్శల పాలు అవుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: