ఏపీ: ఈ పని జగన్ ఆనాడే ఎందుకు చేయలేదు..?

Divya
ఏ రాజకీయాలలో అయినా సరే గెలుపోటములు అనేవి సర్వసాధారణం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో కూటమి 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకోగా వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన సొంత ఊరు పులివెందులకు కూడా వెళ్లడం జరిగింది.అక్కడ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గతంలో సీఎంగా ఉన్నన్ని  రోజులు జగన్ పులివెందులకు ఎన్నోసార్లు వెళ్లారు. అయితే అదంతా అధికార పర్యటనలుగా సాగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అక్కడ ప్రజలను ఎప్పుడూ కూడా కలవలేక పోయారట. ఏపీలో మిగిలిన నియోజకవర్గాల సంగతి వేరే ఉన్న పులివెందుల జగన్ గెలిపిస్తున్న సొంత గడ్డ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అన్నిచోట్ల నియోజవర్గాల కంటే తను నిలబడుతున్న పులివెందుల చోట ఎక్కువ పని చేసేలా చూసుకోవాలి.అయితే అది ఎక్కడ కనిపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పులివెందులలో కూడా మెజారిటీ జగన్కు ఈసారి కాస్త తగ్గిందని కూడా చెప్పవచ్చు. అధికారం పోవడంతో మళ్లీ పులివెందులకు వచ్చిన జగన్ జనాలతో బాగానే మమేకమవుతున్నట్లుగా కనిపిస్తోంది

ముఖ్యంగా జగన్ అందరితో కలిసి మెలిసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా జనాలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.  జగన్ కి కూడా కడప విమానాశ్రయంలోనే జనాలు స్వాగతం భారీగానే పలికారు. జగన్ కోసం పులివెందల జనం అంత తరలివచ్చినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో వృద్దులు యువత మహిళలు చాలామంది ఉన్నారు. ఇలా జగన్ కోసం వారు వచ్చారు జగన్ కూడా జనం కోసమే వచ్చారని అంతగా కనిపిస్తోంది. ఒకవేళ జగన్ గడిచిన ఐదేళ్లలో జనంతో మమేకమై ఉంటే పరిస్థితి మరొక లాగా ఉండేదని వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ సీఎం అయ్యాక తమను కలవనివ్వలేదని కొంతమంది ప్రజలలో అసంతృప్తి ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇక మీదైనా జగన్ పద్ధతి మార్చుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: